షాట్ రెడీ.. టాలీవుడ్‌లో సెప్టెంబర్ నుంచి షూటింగ్‌ల సందడి..

  • Published By: sekhar ,Published On : August 31, 2020 / 06:48 PM IST
షాట్ రెడీ.. టాలీవుడ్‌లో సెప్టెంబర్ నుంచి షూటింగ్‌ల సందడి..

Telugu Movie Shootings in September: కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ వల్ల అన్ని పరిశ్రమలతో పాటు సినీ రంగం కూడా తీవ్ర సంక్షోభం ఎదుర్కొంది. షూటింగులు లేక సినీ కార్మికులు చాలా అవస్థలూ పడ్డారు. సినీ ప్రముఖులు ముందుకొచ్చి వారిని ఆదుకున్నారు. అయితే తిరిగి షూటింగులు ఎప్పుడు ప్రారంభమవుతాయి.. థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయి అని పరిశ్రమ వర్గాలవారు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి నిరీక్షణకు తెరదించుతూ సెప్టెంబర్ నుంచి సినిమా పరిశ్రమలో సందడి మొదలుకాబోతోంది. సెప్టెంబర్ 1 నుంచి చిన్న సినిమాలతో పాటు భారీ బడ్జెట్ సినిమాలు కూడా సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

కింగ్ నాగార్జున నటిస్తున్న ‘వైల్డ్ డాగ్’ షెడ్యూల్ ఆగస్టు 31 నుంచి స్టార్ట్ కానుంది. దీంతో పాటు అతిపెద్ద టెలివిజన్ రియాలిటీ షో ‘బిగ్‌బాస్-4’ షూటింగ్ కూడా స్టార్ట్ చేయబోతున్నాడు నాగ్.Nagarjunaరెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘రాధేశ్యామ్’ షెడ్యూల్ సెప్టెంబర్ 20 నుంచి ప్రారంభం కానుంది. ఇందుకోసం రామోజీ ఫిలింసిటీలో ఫారిన్ సెట్‌తోపాటు హాస్పిటల్ సెట్ వేశారు.Prabhasనాగ చైతన్య, శేఖర్ కమ్ముల కలయికలో తెరకెక్కుతున్న ‘లవ్ స్టోరీ’ కొత్త షెడ్యూల్ సెప్టెంబర్ 7 నుంచి స్టార్ట్ కానుంది. సింగిల్ షెడ్యూల్ బ్యాలెన్స్ షూట్ పూర్తిచేసి, విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో చేయబోయే ‘థ్యాంక్యూ’ సినిమాను ప్రారంభించాలనేది చైతు ఆలోచన.Naga Chaitanyaసత్యదేవ్, మిల్కీబ్యూటీ తమన్నా జంటగా నటిస్తున్న ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్లోనే స్టార్ట్ చేయనున్నారు. దర్శకుడు సతీష్ వేగేశ్న తాజా చిత్రం ‘కోతికొమ్మచ్చి’ సెప్టెంబర్ చివరివారం నుంచి పట్టాలెక్కనుంది. తన కొడుకు సమీర్, దివంగత శ్రీహరి తనయుడు మేఘాంష్ హీరోలుగా నటించనున్నారు.

Gurtunda Seethakalam

డైరెక్టర్ సంపత్ నంది ఏకంగా రెండు సినిమాలను సెట్స్ పైకి తెచ్చే ప్లాన్ చేశాడు. ఊర్వశీ రౌటేలా కథానాయికగా టాలీవుడ్‌కి పరిచయమవుతున్న చిత్రానికి కథ ఇచ్చాడు సంపత్ నంది. దీంతో పాటు గోపిచంద్‌తో చేస్తున్న ‘సీటీమార్’ సినిమా కొత్త షెడ్యూల్ కూడా స్టార్ట్ చేయనున్నాడు.Gopichandఇలా మీడియం సినిమాలతో పాటుగా పెద్ద సినిమాలు కూడా ఒకేసారి సెట్స్ పైకి రానుండడంతో టాలీవుడ్‌లో సందడి వాతావరణం కనిపించనుంది.
షూటింగులు స్టార్ట్ అయితే దర్శక నిర్మాతలు, నటీనటులు, సాంకేతిక నిపుణుల నుంచి జూనియర్ ఆర్టిస్టుల వరకు అందరి ముఖాల్లో కొత్త ఆనందం కనిపిస్తుందని కొత్తగా చెప్పనవసరం లేదు.