Naga Shaurya: నాగశౌర్య సినిమాకు సౌత్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరంటే?
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన రీసెంట్ మూవీ ‘కృష్ణ వ్రిందా విహారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు హీరో నాగశౌర్య తన నెక్ట్స్ మూవీని తాజాగా అనౌన్స్ చేశాడు. శౌర్య కెరీర్‌లో 24వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాకు సంబంధించి తాజాగా మరో అప్డేట్ ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది. ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు సౌత్ ఇండియన్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్‌ను ఓకే చేసింది.

Top Music Director Onboard For Naga Shaurya Next Movie
Naga Shaurya: టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య నటించిన రీసెంట్ మూవీ ‘కృష్ణ వ్రిందా విహారి’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాపై చిత్ర యూనిట్ భారీ అంచనాలు పెట్టుకున్నా, వాటిని అందుకోవడంలో సినిమా కొంతమేర సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు హీరో నాగశౌర్య తన నెక్ట్స్ మూవీని తాజాగా అనౌన్స్ చేశాడు. శౌర్య కెరీర్‌లో 24వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను ఎస్.ఎస్.అరుణాచలం డైరెక్ట్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ ప్రకటించింది.
Naga Shaurya : ‘జూ.ఎన్టీఆర్’కు ఒక న్యాయం.. నాకొక న్యాయమా.. విలేకరిపై నాగశౌర్య సీరియస్!
ఇక ఈ సినిమాను వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై శ్రీనివాస రావు చింతలపూడి, విజయ్ కుమార్ చింతలపూడి, డా.అశోక్ కుమార్ చింతలపూడి కలిసి ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరోసారి పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సబ్జెక్ట్‌కే నాగశౌర్య ఓకే చెప్పినట్లుగా చిత్ర యూనిట్ చెబుతోంది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అదిరిపోయే అప్డేట్‌ను చిత్ర యూనిట్ అనౌన్స్ చేసింది.
ఈ సినిమాకు సంగీతాన్ని అందించేందుకు సౌత్ ఇండియన్ పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్ హారిస్ జయరాజ్‌ను ఓకే చేసింది చిత్ర యూనిట్. ఆయన తమ సినిమాకు సంగీతాన్ని అందించడం నిజంగా సంతోషంగా ఉందని చిత్ర యూనిట్ అంటోంది. కాగా, ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, టెక్నీషియన్స్‌కు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఏదేమైనా టాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్‌గా హారిస్ జయరాజ్, శౌర్య నటిస్తున్న సినిమాకు సంగీతం అందించనుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు క్రియేట్ అవుతున్నాయి.
Team #NS24 welcomes the Music Magician @Jharrisjayaraj on board! ?✨
?ing @IamNagashaurya@Arunachalam_SS @vaishnavi_films #SrinivasaRaoChintalapudi #VijayKumarChintalapudi #AshokKumarChintalapudi pic.twitter.com/wflZ9Mr0DW
— Vaishnavi Films (@vaishnavi_films) November 4, 2022