UnStoppable 2 : బాలయ్య అన్ స్టాపబుల్ సీజన్ 2 రెడీ.. అధికారికంగా ప్రకటించిన ఆహా..
అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. అన్ స్టాపబుల్ షో...................

Balakrishna : బాలయ్య బాబులోని మరో కోణాన్ని చూపించిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. ఆహా ఓటీటీలో గతంలో బాలయ్య బాబు హోస్ట్ గా టెలికాస్ట్ అయిన ప్రోగ్రాం అన్ స్టాపబుల్. అసలు బాలకృష్ణ ఏంటి? యాంకర్ ఏంటి? అనుకున్న వాళ్లంతా ఈ షో చూసి ఆశ్చర్యపోయారు. షోలో బాలయ్య బాబు ఎంటర్టైన్మెంట్, హడావిడి, వచ్చిన గెస్టులతో సరదాలు.. ఇలా షోకి సంబంధించిన ప్రతి ఒక్కటి బాలయ్యబాబు అభిమానులనే కాక ప్రేక్షకులందర్నీ మెప్పించాయి.
అన్ స్టాపబుల్ షో తర్వాత బాలయ్య క్రేజ్ అమాంతంగా పెరిగిపోయింది. ఈ టాక్ షో మన దేశంలో ప్రసారమయ్యే టాక్ షోలలోనే 9.7 రేటింగ్‌తో IMDBలో తొలి స్థానంలో నిలిచింది. అన్ స్టాపబుల్ షో కోసం ప్రతి వారం సామాన్య ప్రేక్షకులతో పాటు, సెలబ్రిటీలు కూడా ఎదురు చూశారు. ప్రోగ్రాంని చాలా చక్కగా ప్లాన్ చేసి టెలికాస్ట్ చేసింది ఆహా. మొదటి సీజన్ 10 ఎపిసోడ్స్ తో గ్రాండ్ గా ముగిసింది. మొదటి సీజన్ లో మంచు ఫ్యామిలీ, పుష్ప టీం, రవితేజ, అఖండ టీం, బ్రహ్మానందం, రాజమౌళి, మహేష్ బాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు వచ్చి అలరించారు.
Varun Tej : బాలీవుడ్ ఎంట్రీ వస్తే వదులుకోను.. షారుఖ్ తో నటించాలని ఉంది..
దీంతో అన్ స్టాపబుల్ సీజన్ 2 ఎప్పుడొస్తుందా, బాలయ్య బాబుని మళ్ళీ ఆ రేంజ్ జోష్ లో ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఇప్పటివరకు పలు రకాల వార్తలు కూడా వినిపించాయి అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి. అయితే వాటన్నిటికీ చెక్ పెడుతూ ఆహా టీం అధికారికంగా అన్ స్టాపబుల్ సీజన్ 2 ప్రకటించింది. ఇటీవల ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ షోకి సెమి ఫైనల్ లో గెస్ట్ గా వచ్చిన బాలయ్యని అన్ స్టాపబుల్ సీజన్ 2 గురించి అడగగా.. మధుర క్షణాలకి ముగింపు ఉండదు, కొనసాగింపే అంటూ చెప్పారు. ఆ వీడియో బైట్ తో అన్ స్టాపబుల్ సీజన్ 2 కమింగ్ సూన్ అని పోస్ట్ చేశారు ఆహా టీం.
దీంతో బాలయ్య అభిమానులతో పాటు, ప్రేక్షకులు కూడా ఆనందం వ్యక్తం చేస్తూ ఈ సారి ఎవరెవరు గెస్టులుగా వస్తారా అని ఆలోచిస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 2 మరింత సరికొత్తగా, మరింత ఎంటర్టైన్మెంట్ తో, మరిన్ని రికార్డ్స్ సృష్టిస్తుంది అని అంటున్నారు నిర్వాహకులు.
1Panchayat Election: 21ఏళ్లకే సర్పంచ్ ఎన్నికలు గెలిచిన యువతి
2Uddhav Thackeray: తగ్గుతున్న ఉద్ధవ్ బలం.. పై చేయి సాధిస్తున్న షిండే
3Eesha Rebba : తెలుపు అందాలతో తెలుగమ్మాయి ఈషా రెబ్బ
4Sai Kiran : మోసం చేశారంటూ నిర్మాతలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు..
5Nirupam : భార్యకి ఏడువారాల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు..
6Sena Rebels: నేడు ‘మహా’ పంచాయితీపై సుప్రీంకోర్టులో విచారణ
7New Labour Laws : కొత్త కార్మిక చట్టాలు..జులై 1 నుంచి జీతం తగ్గుతుందా!
8Woman Suicide: లైంగిక వేధింపులతో మహిళ ఆత్మహత్య
9Hardik Pandya: కొత్త ఇండియన్ రికార్డు నెలకొల్పిన హార్దిక్ పాండ్యా
10Rythubandhu: రేపటి నుంచి రైతుబంధు పంపిణీ
-
Minister KTR : యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి కేటీఆర్
-
Yashwant Sinha : నేడే యశ్వంత్ సిన్హా నామినేషన్
-
Maharashtra Politics : మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంలో మరో మలుపు
-
Strange Creature : ఏలియన్‌ను పోలిన వింత జీవి
-
Adilabad : ఆర్టీసీ బస్సులో గర్భిణి ప్రసవం
-
Aaditya Thackeray : ఏక్ నాథ్ షిండే పై మంత్రి ఆధిత్యఠాక్రే సంచలన ఆరోపణలు
-
Dry Cough : సీజన్ మారుతున్న వేళ వేధించే పొడి దగ్గు!
-
Depression : బలవర్ధకమైన ఆహారంతో డిప్రెషన్ దూరం!