సినిమా చూపిస్తా మావ : ఏ సినిమా ఎప్పుడు రిలీజ్

సినిమా చూపిస్తా మావ : ఏ సినిమా ఎప్పుడు రిలీజ్

upcoming movies : కరోనా కారణంగా సైలెంటైపోయిన టాలీవుడ్.. మళ్లీ ఊపిరి పీల్చుకొని.. జూలు విదిల్చింది. నెలల గ్యాప్ తర్వాత థియేటర్లలో.. మళ్లీ రీసౌండ్ మొదలైంది. గతేడాది నెలల పాటు ఇంటికే పరిమితమైన సినిమా లవర్స్, ఫ్యాన్స్, ఆడియెన్స్.. ఈ ఏడాది మొత్తం థియేటర్లకు క్యూ కట్టే అనౌన్స్‌మెంట్స్ వచ్చేశాయి. పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు ఫిక్స్ అయిపోయాయి. షూటింగ్‌ పూర్తైనవి.. ఇంకా షూటింగ్‌లోనే ఉన్న సినిమాలకు సంబంధించి.. నెలల ముందే రిలీజ్ డేట్లు ప్రకటించేశారు నిర్మాతలు. ఓ పక్క పెద్ద సినిమాలు షూటింగ్స్‌తో బిజీ కాగా.. మరోపక్క కొత్త చిత్రాల రిలీజ్‌లతో సందడి సందడిగా మారబోతోంది 2021. ప్రేక్షకుల కేకలు, ఈలలతో జోరుగా, హుషారుగా మారబోతోన్నాయి. అగ్ర హీరోలందరూ వరుసబెట్టి థియేటర్లకు క్యూ కడుతున్నారు.

– మెగాస్టార్ చిరంజీవి, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆచార్య’ మూవీ టీజర్.. సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వీళ్లిద్దరి కాంబోలో వస్తున్న ఈ మూవీ.. ఎలా ఉంటుందోనని ఫ్యాన్స్, ఆడియెన్స్ అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సమ్మర్‌లో బాస్ థియేటర్లో అడుగుపెట్టబోతున్నారు. మే 13న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది ‘ఆచార్య’ సినిమా.

– ఇండియా మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ రిలీజ్ డేట్‌‌ను కూడా.. మేకర్స్ అనౌన్స్ చేశారు. జులై 16న.. గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది కేజీఎఫ్. అన్ని భాషల్లోని ఆడియెన్స్.. ఈ సినిమా కోసం ఎంతలా వెయిట్ చేస్తున్నారో.. టీజర్‌కి వచ్చిన రెస్పాన్స్, మిలియన్ల కొద్దీ వ్యూస్ చెబుతున్నాయి.

– టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు.. వచ్చే సంక్రాంతికి ల్యాండ్ కాబోతున్నాడు. గీత గోవిందం ఫేమ్.. పరశురామ్ డైరెక్షన్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ‘సర్కారు వారి పాట’.. 2022 సంక్రాంతికి రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం దుబాయ్‌లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది.

– తెలుగు ఆడియెన్స్‌తో పాటు టోటల్ ఇండియా మొత్తం ఈగర్‌గా వెయిట్ చేస్తున్న మూవీ ‘ట్రిపుల్ ఆర్’. రాజమౌళి డైరెక్షన్‌లో.. రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్ మల్టీ కాంబో యాక్షన్.. సినిమాపై అంచనాలు అమాంతం పెంచేశాయి. బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీ.. అక్టోబర్ 13న రిలీజ్ కాబోతోంది.

– సుకుమార్-అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కుతున్న ‘పుష్ప’.. రిలీజ్ డేట్ కూడా మేకర్స్ రివీల్ చేసేశారు. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో.. పుష్పరాజ్ క్యారెక్టర్‌లో.. బన్నీ ఊర మాస్ లుక్‌లో కనిపించాడు. ఈ పోస్టర్ ఫ్యాన్స్‌కి బిర్యానీ పెట్టేసింది. ఆగస్ట్ 13న.. ‘పుష్ప’ మూవీ రిలీజ్ కాబోతోంది. లారీ డ్రైవర్‌ పుష్పరాజ్‌ పాత్రలో అల్లు అర్జున్ కొత్త మేకోవర్‌లో కనిపించనున్నారు.

– ‘ఎఫ్‌ 2’ సీక్వెల్ మూవీ.. ‘ఎఫ్‌ 3’ రిలీజ్‌కి మూహూర్తం ఫిక్సైంది. ఆగస్ట్ 27న.. వెంకీ, వరుణ్ తేజ్.. మళ్లీ థియేటర్లో నవ్వులు పంచేందుకు రాబోతున్నారు.

– రానా, సాయిపల్లవి కాంబినేషన్లో.. వేణు ఊడుగుల డైరెక్షన్‌లో తెరకెక్కిన ‘విరాటపర్వం’ మూవీ.. ఏప్రిల్ 30న రిలీజ్ కాబోతోంది. నక్సలైట్ రవన్న లైఫ్‌లోని రియలిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా వస్తున్న ఈ సినిమా సమ్మర్‌ని ఇంకాస్త హీటెక్కించబోతోంది. శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో.. సాయిపల్లవి, నాగచైతన్య నటించిన లవ్ స్టోరీ ఏప్రిల్ 16న రిలీజ్ కాబోతోంది.

– ఇక.. అడివిశేష్ హీరోగా నటిస్తున్న ‘మేజర్’ మూవీ జులై 2న రిలీజ్ కాబోతోంది. ట్వంటీ సిక్స్ బై లెవన్ ముంబాయ్ తీవ్రవాదుల దాడుల్లో వీరమరణం పొందిన మేజర్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా తెరకెక్కుతోంది. అడవి శేష్‌ టైటిల్ రోల్‌లో గూఢచారి ఫేమ్ శశికిరణ్ తిక్క డైరెక్షన్‌ చేస్తున్నారు.

– నితిన్, కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘రంగ్ దే’ మూవీ.. మార్చ్ 26న థియేటర్లలో సందడి చేయబోతోంది.

– వెంకటేశ్ నటిస్తున్న ‘నారప్ప’ సినిమా.. మే 14న రిలీజ్ కాబోతోంది.

– వరుణ్ తేజ్ కూడా తన అప్‌కమింగ్ మూవీ ‘గని’.. రిలీజ్ డేట్ చెప్పేశాడు. కిరణ్ కొర్రపాటి డైరెక్షన్‌లో.. బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమా.. జులై 30న రిలీజ్ చేయనున్నారు.

– కబడ్డీ బ్యాక్ డ్రాప్‌లో.. గోపీచంద్ నటిస్తున్న ‘సీటీ మార్’ మూవీ కూడా ఏప్రిల్ 2న రిలీజ్ కాబోతోంది.

– మరోవైపు వకిల్ సాబ్‌ రిలీజ్‌ డేట్ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. పెద్ద పెద్ద సినిమాలు విడుదల తేదీలు ఖరారవుతున్న నేపథ్యంలో… తొందర్లోనే రిలీజ్ డేట్ ప్రకటించమని ఫ్యాన్స్‌ నిర్మాత, దర్శకులపై ఒత్తిడి పెంచుతున్నారట. అయితే సమ్మర్‌లో ‘వకీల్‌ సాబ్’ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి.