మళ్లీ దొరికేసింది:కంట్రోల్ ‘సి’ కంట్రల్ ‘వి’ – కాపీ కూడా క్రియేటివిటేనే అమ్మడూ..

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి ట్వీట్ కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది..

  • Published By: sekhar ,Published On : April 1, 2020 / 03:11 PM IST
మళ్లీ దొరికేసింది:కంట్రోల్ ‘సి’ కంట్రల్ ‘వి’ – కాపీ కూడా క్రియేటివిటేనే అమ్మడూ..

బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా మరోసారి ట్వీట్ కాపీ పేస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయింది..

కాపీ కొట్టడం కూడా క్రియేటివిటీనే అంటుంటారు కొందరు మేధావులు.. కొడితే కొట్టాం కానీ అందులో మన మార్క్ ఉండాలనేది వీరి వాదన. ఇక కాపీ కొట్టి దొరికిపోతే ఆ బాధ వర్ణనాతీతం. బాలీవుడ్ నటి ఊర్వశీ రౌతేలా పరిస్థితి ఇలానే ఉందిప్పుడు. హైలెట్ ఏంటంటే అమ్మడు కాపీ కొట్టి నెటిజన్లకు దొరకడం ఇది కొత్తేం కాదు. గతంలో ప్రధాని మోడీ, మోడల్ జిగీ హాడిడ్ ట్వీట్లను కాపీ పేస్ట్ చేసి చీవాట్లు తిన్న ఊర్వశి తాజాగా ఆస్కార్ విన్నింగ్ కొరియన్ మూవీ ‘పారాసైట్’ విషయంలో న్యూయార్క్‌ రైటర్ జేపీ బ్రామర్ ట్వీట్‌ను కాపీ చేసింది.

దీంతో కాపీ చేసేటప్పుడు గ్రామర్ చూసుకోవమ్మా అంటూ బ్రామర్ క్లాస్ పీకాడు. ‘పారాసైట్ సినిమా నాకు బాగా నచ్చింది. అబద్ధాలు చెప్పి ఉద్యోగాలు సంపాదించినా, నటీనటుల నటనకు నేను ఫిదా అయ్యాను. తెలివితేటలున్నా, పేద కుటుంబం కావడతో నిజానిజాలు దాచిపెట్టి, చివరకు వాళ్ల టాలెంట్ చేత సదరు ధనిక కుటంబం చేత ఉద్యోగాలు సంపాదిస్తారు’ అంటూ అమ్మడు ట్వీటింది. వావ్.. నైస్.. అంటూ నెటిజన్లు మెచ్చకుంటుండగా, రైటర్ జేపీ బ్రామర్ లైన్లోకి వచ్చాడు.

‘పక్కవాళ్ల ట్వీట్ కాపీ చేసేటప్పుడు గ్రామర్ తప్పులను కూడా సరిచూడకుండా ఉన్నదున్నట్లు దింపడమేంటి?’.. అని ప్రశ్నించడంతో పాటు ‘కాపీ చేసేటప్పుడు కాస్తో కూస్తో మార్పులు చేర్పులు చేయాలి, గ్రామర్ తప్పులు సరిచూసుకోవాలి’ అని సలహా కూడా ఇచ్చాడు. ఇక దీంతో నెటిజన్లు పాపపై ఫైర్ అవడం స్టార్ట్ చేశారు. ఊర్వశీకి మెదడు లేదు అని, ఇది ఊహించేదేలే అని క్రియేటివిటీకి తగ్గట్టు వారు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఊర్వశీ ఈ ట్వీట్ డిలీట్ చేస్తుందా లేక మార్పులు చేర్పులు చేస్తుందా అనేది చూడాలి.