Kantara 2: కాంతార-2లో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరో తెలుసా..?

గతేడాది కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేసింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ కాంతార సంచలనం సృష్టించింది.

Kantara 2: కాంతార-2లో బాలీవుడ్ బ్యూటీ.. ఎవరో తెలుసా..?

Urvashi Rautela To Star In Kantara 2

Kantara 2: గతేడాది కన్నడలో తెరకెక్కిన ‘కాంతార’ మూవీ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను హీరో కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి తెరకెక్కించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేసింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లోనూ కాంతార సంచలనం సృష్టించింది.

Kantara : కాంతార-2 కన్‌ఫార్మ్ చేసిన నిర్మాత.. సీక్వెల్ కాదు ప్రీక్వెల్!

అటు వసూళ్ల పరంగానూ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాకు సంబంధించి రెండో భాగం కూడా ఉండబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ సినిమా సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా.. ఈ సినిమా ఎప్పుడెప్పుడు పూర్తయి థియేటర్లలో రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ రెండో భాగం.. కాంతార తొలిభాగానికి ప్రీక్వెల్‌గా రాబోతుండటంతో ఈ సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా క్రియేట్ అవుతున్నాయి. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలాను సెలెక్ట్ చేశారు చిత్ర యూనిట్.

Kantara: కాంతార వచ్చేస్తోంది.. ఎక్కడో తెలుసా..?

ఈమేరకు ఊర్వశి తన సోషల్ మీడియా అకౌంట్‌లో క్లారిటీ ఇచ్చేసింది. కాంతార-2లో తాను భాగస్వామ్యం కాబోతున్నట్లు ఆమె పేర్కొంది. తొలి భాగంలో సప్తమి గౌడ హీరోయిన్‌గా నటించగా, ఇప్పుడు కాంతార-2లో ఊర్వశి హీరోయిన్‌గా నటిస్తోండటంతో ఈ సినిమాపై బాలీవుడ్‌లోనూ మంచి బజ్ క్రియేట్ అవడం ఖాయమని చిత్ర వర్గాలు అంటున్నాయి. మరి ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇస్తుందో తెలియాలంటే కాంతార-2 బాక్సాఫీస్ వద్ద రిలీజ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.