వదలడు – రివ్యూ

సిద్ధార్ద్, కేథరిన్ జంటగా.. సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వదలడు’ మూవీ రివ్యూ..

  • Published By: sekhar ,Published On : October 12, 2019 / 06:30 AM IST
వదలడు – రివ్యూ

సిద్ధార్ద్, కేథరిన్ జంటగా.. సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘వదలడు’ మూవీ రివ్యూ..

హీరో సిద్ధార్ద్‌కు తమిళ్‌తో పాటు తెలుగులో కూడా మంచి ఇమేజ్ ఉంది. తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి.. మంచి మార్కెట్ సంపాదించాడు.. అయితే ఈ మధ్య కాలం కలసిరాక కొన్నేళ్ల నుండి హిట్‌కు దూరంగా ఉంటున్నాడు. సాయి శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అరువన్’ సినిమాను తెలుగులో ‘వదలడు’ పేరుతో డబ్ చేశారు.. కేథరిన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ట్రైలర్స్ చాలా ఇంప్రెసివ్‌గా ఉండి సినిమాపై అంచనాలు పెంచాయి. ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా సిద్ధార్ద్‌కు హిట్ ఇచ్చిందా.. రొటీన్ మూవీ అయ్యిందా.. చూద్దాం…  

కథ విషయానికి వస్తే : ఫుడ్ సేప్టీ ఆఫీసర్ అయిన జగన్.. తన జాబ్ విషయంలో చాలా సిన్సియర్‌గా ఉంటాడు.. లంచాలకు లొంగకుండా.. మోసాలు చేసే వారిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకుంటుంటాడు. ఈక్రమంలో జగన్, జ్యోతి అనే స్కూల్ టీచర్ ప్రేమలో పడతాడు. కాని జ్యోతి మాత్రం జగన్‌ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు.. అయితే.. కొన్ని అనుకోని సంఘటనల వలన జగన్‌ను పెళ్ళి చేసుకోవాలి అనుకంటుంది జ్యోతి. అప్పుడే జగన్ గురించి ఓ నిజం తెలుస్తుంది ఆమెకి.. అయితే జ్యోతికి తెలిసిన ఆ నిజం ఏంటి? జ్యోతి చివరకు జగన్‌ను పెళ్ళి చేసుకుందా లేదా? జగన్ సిన్సియారిటీ వల్ల అతనికి ఎదురైన అనుభవాలు ఏంటి.. అనేది సినిమా చూసి తెలుసుకోవలసిందే.

Read Also : ఆర్‌డిఎక్స్ లవ్ – రివ్యూ

నటీనటుల విషయానికొస్తే : సిద్ధార్ద్ ఎప్పటి లాగే  స్టైలింగ్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. క్యారెక్టర్‌కు తగినట్టు చాలా బాగా నటించాడు. హీరోయిన్ కేథరిన్ తన నటనతో ఆకట్టుకుంది.. విలన్‌గా నటించిన కబీర్ సింగ్ బెస్ట్  పర్ఫామెన్స్‌‌తో అదరగొట్టాడు. మిగతా నటీ నటులు అందరు కూడా పాత్రల పరిధి మేర బాగా నటించారు. 

 టెక్నీషయన్స్ విషయానికి వస్తే : నేటి సమాజంలో జరుగుతున్న బర్నింగ్ ఇష్యూని తీసుకుని, ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సాయి శేఖర్.. ఈ స్టోరీలైన్‌తో ఆకట్టుకునే విధంగా దాన్ని సినిమాగా మలచడంలో తడబడ్డాడు. సినిమాటోగ్రాఫర్ ఏకాబరం పనితనం బాగుంది. డైరెక్టర్ విజన్‌కు అనుగుణంగా సినిమాలోని ప్రతీ ఫ్రేమ్‌ను అందంగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించాడు. తమన్ సంగీతం ఆకట్టుకుంది. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేది.. నిర్మాణ విలువలు బాగున్నాయి.. 

ఓవరాల్‌గా చెప్పాలి అంటే : దర్శకుడు సాయి శేఖర్ ఓ మంచి స్టోరీ లైన్‌తో.. మంచి మెసేజ్‌తో.. కొన్ని హారర్ సీన్స్‌తో.. ఆకట్టుకునే ప్రయత్నం చేసినా.. సరైన స్క్రీన్‌ప్లే లేకపోవడంతో.. ‘వదలడు’ సినిమా అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయింది.  

ప్లస్ పాయింట్స్
హీరో, హీరోయిన్స్ నటన
సంగీతం
సినిమాటోగ్రఫీ

మైనస్ పాయింట్స్ 
స్క్రీన్‌ప్లే
ఎడిటింగ్ 
కొన్ని రొటీన్ సీన్స్