Vaishnav Tej: మరోటి మొదలుపెడుతున్న మెగా హీరో!

మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి....

Vaishnav Tej: మరోటి మొదలుపెడుతున్న మెగా హీరో!

Vaishnav Tej: మెగా హీరో వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ పర్ఫార్మెన్స్‌కు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఈ సినిమా సక్సెస్ తరువాత వైష్ణవ్ తేజ్ కొండపొలం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈ సినిమా కమర్షియల్‌గా యావరేజ్ మూవీగా నిలిచింది. కాగా.. ప్రస్తుతం ‘రంగరంగ వైభవంగా’ అనే సినిమాలోనటిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇక ఈ సినిమాతో మరోసారి అదిరిపోయే సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు వైష్ణవ్.

Vaishnav Tej : త్రివిక్రమ్‌తో మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్‌తేజ్ సినిమా..

అయితే.. తన తాజా చిత్రం రిలీజ్ కాకముందే మరొక సినిమాను పట్టాలెక్కించేందుకు రెడీ అయ్యాడు ఈ హీరో. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై వైష్ణవ్ తేజ్ తన నెక్ట్స్ చిత్రాన్ని తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమాను శ్రీకాంత్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించబోతున్నాడు. కాగా.. ఈ సినిమాను అఫీషియల్‌గా లాంఛ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ నెల 22న తన కొత్త సినిమాను స్టార్ట్ చేసేందుకు వైష్ణవ్ తేజ్ సిద్ధమయ్యాడు.

Vaishnav Tej: మెగా హీరో డేరింగ్ స్టెప్.. అంచనాలు పెంచేస్తున్నాడుగా!

భారీ బడ్జెత్‌తో ఈ సినిమాను తెరకెక్కించేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. ఇక ఈ సినిమా లాంఛ్‌ను కూడా భారీగా ప్లాన్ చేశారట చిత్ర నిర్మాత. ఈ సినిమా ముహూర్తానికి పలువురు ప్రముఖులు హాజరవుతారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో మిగతా నటీనటుల గురించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. మరి ఈసారి వైష్ణవ్ తేజ్ ఎలాంటి సినిమాతో మనముందుకు వస్తాడో చూడాలి.