Venkatesh – Keeravani : వెంకటేష్, కీరవాణి ఇంట పెళ్లి భజంత్రీలు మోగబోతున్నాయా..?

టాలీవుడ్ లోని కుటుంబాల్లో వరుసగా పెళ్లి భజంత్రీలు మోగబోతున్నాయా..? హీరో వెంకటేష్ రెండు కూతురు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కుమారుడు పెళ్ళికి సిద్దమవుతున్నారట.

Venkatesh – Keeravani : వెంకటేష్, కీరవాణి ఇంట పెళ్లి భజంత్రీలు మోగబోతున్నాయా..?

Venkatesh daughter Keeravani son Simha Koduri marriage news

Updated On : October 24, 2023 / 5:10 PM IST

Venkatesh – Keeravani : ఈ ఏడాది టాలీవుడ్ లోని కుటుంబాల్లో వరుసగా పెళ్లి భజంత్రీలు వినిపిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే శర్వానంద్ ఒక ఇంటివాడు అయ్యిపోగా, వరుణ్ తేజ్ పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు మరో రెండు టాలీవుడ్ ఫ్యామిలీస్ లో కూడా పెళ్లి భజంత్రీలు మోగబోతున్నాయంటూ ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది. హీరో వెంకటేష్ రెండు కూతురు, మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి రెండో కుమారుడు పెళ్ళికి సిద్దమవుతున్నారట.

వెంకటేష్ కి మొత్తం నలుగురు పిల్లలు కాగా.. వారిలో ముగ్గురు అమ్మాయిలు, ఒక అబ్బాయి. ఇక వీరిలో పెద్ద అమ్మాయికి ఆల్రెడీ పెళ్లి చేసేశాడు వెంకటేష్. ఇప్పుడు రెండో అమ్మాయిని అత్తారింటికి పంపించడానికి వెంకీ మామ సిద్దమవుతున్నాడట. విజయవాడకి చెందిన ఒక డాక్టర్ ఫ్యామిలీలోని అబ్బాయికి తన కూతురిని ఇచ్చి పెళ్లి చేయబోతున్నాడట వెంకటేష్. ఈ ఎంగేజ్మెంట్ కూడా రేపే (అక్టోబర్ 24) జరగబోతుంది అంటూ సినీ సర్కిల్ లో ఉండే వ్యక్తులు చెబుతున్న సమాచారం.

Also read : Aadi Keshava : లీలమ్మో మాస్ డాన్స్ అదరగొట్టేసిందమ్మా.. ఆదికేశవ కొత్త సాంగ్ చూశారా..!

అలాగే కీరవాణి కూడా తన రెండో కొడుకుకి పెళ్లి చేయడానికి సిద్దమయ్యాడట. ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోగా సినిమాలు చేస్తూ వస్తున్న ‘సింహా’.. త్వరలో పెళ్లి జీవితాన్ని కూడా మొదలు పెట్టనున్నాడని సమాచారం. టాలీవుడ్ సీనియర్ యాక్టర్ మురళి మోహన్ మనవరాలు అయిన రాగా మాగంటితో సింహా పెళ్లి కుదిరినట్లు చెబుతున్నారు. త్వరలోనే ఈ రెండు కుటుంబాలు వియ్యం అందుకోనున్నారట. అయితే ఈ రెండు పెళ్లి వార్తలు గురించి.. ఆ ఫ్యామిలీస్ నుంచి ఎటువంటి అధికారిక సమాచారం రాలేదు.