Vijay Devarakonda : నాకు టైం లేదు.. అందుకే చెప్పులు వేసుకుంటున్నాను..

విజయ్ సమాధానమిస్తూ.. ''నాకు ఆ టైంలో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. సినిమా రిలీజ్‌కి ఎక్కువ టైం లేదు. ప్రస్తుతం నేను ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. ప్రతిరోజూ..........

Vijay Devarakonda : నాకు టైం లేదు.. అందుకే చెప్పులు వేసుకుంటున్నాను..

Vijay Devarakonda

Vijay Devarakonda :  పూరి జగన్నాథ్‌ డైరెక్షన్‌లో విజయ్‌ దేవరకొండ, అనన్య పాండే జంటగా పాన్ ఇండియా సినిమాగా రాబోతుంది ‘లైగర్‌’. ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్. అయితే ప్రమోషన్స్ లో విజయ్ దేవరకొండ మామూలు చెప్పులు వేసుకొని వస్తున్నాడు. దీంతో విజయ్ మరింత హైలెట్ అవుతున్నాడు. ఇటీవల రణవీర్ సింగ్ కూడా స్టేజి మీదే ఏంటి చెప్పులు వేసుకొచ్చావు అని అడిగాడు విజయ్ ని.

ఇలా విజయ్ చెప్పులు వేసుకురావడం కూడా హైలెట్ అవుతుండటంతో కొంతమంది విజయ్ సింప్లిసిటీగా ఉంటున్నాడు అంటే, మరికొంతమంది విజయ్ కావాలని అటెన్షన్‌ కోసమే ఇలా చేస్తున్నాడంటూ విమర్శలు చేస్తున్నారు. తాజాగా జరిగిన ఓ ప్రెస్ మీట్ లో కూడా విజయ్ ని ఓ విలేఖరి చెప్పులు వేసుకొస్తున్నారేంటి అని అడిగాడు.

VV Vinayak : బాలకృష్ణ చెల్లెలి పాత్రకి అడిగితే ఏడ్చేసింది.. ఇండస్ట్రీలో తల్లి, చెల్లి పాత్రలు వెతకడం కష్టం..

దీనికి విజయ్ సమాధానమిస్తూ.. ”నాకు ఆ టైంలో ఏది నచ్చితే అదే ధరిస్తాను. బ్రాండ్‌తో సంబంధం లేకుండా అన్నిరకాల వస్తువులను ఇష్టపడతాను. సినిమా రిలీజ్‌కి ఎక్కువ టైం లేదు. ప్రస్తుతం నేను ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాను. ప్రతిరోజూ ఒక డ్రెస్‌, దానికి సెట్ అయ్యే షూస్ కోసం వెతుక్కుంటూ నా టైంని వేస్ట్ చేసుకోలేను. అందుకే ఈ చెప్పులు కొనుక్కున్నాను. దీనివల్ల చాలా టైం సేవ్ అవుతుంది, కంఫర్ట్ గా కూడా ఉంది. అయినా నాకు ఏం చేయాలనిపిస్తే అదే చేస్తాను. ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో అని పట్టించుకోను” అని తెలిపారు.

అయితే దీనిపై కూడా మరీ అంత టైం లేదా అంటూ కొంతమంది నెగిటివ్ ట్రోల్స్ చేస్తున్నారు. ఏదైతేనేం ఎప్పుడూ ఏదో రకంగా వార్తల్లో ఉండే విజయ్ ఇలా చెప్పులు వేసుకొని కూడా హైలెట్ అవుతున్నాడు.