Vijay Devarakonda : లైగర్ బిజినెస్ అయిపోయిందా?? విజయ్ కి బాలీవుడ్ బాగా కలిసొస్తుందా??

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో అనన్యపాండే హీరోయిన్ గా వస్తున్న లైగర్ రిలీజ్ కు ముందే రికార్డ్ రేంజ్ లో బిజినెస్ చేస్తోంది. ఆల్రెడీ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సినిమా మీద......

Vijay Devarakonda : లైగర్ బిజినెస్ అయిపోయిందా?? విజయ్ కి బాలీవుడ్ బాగా కలిసొస్తుందా??

Vijay Devarakonda

Liger :  బాలీవుడ్ లో విజయ్ క్రేజ్ కి ఫిదా అయిపోతున్నారు అందరూ. మొన్నటి వరకూ ఆడియన్స్, హీరోయిన్సే అనుకుంటే ఇప్పుడు ఆ లిస్ట్ లో డిస్ట్రిబ్యూటర్లు కూడా యాడ్ అయ్యారు. ఇలా బాలీవుడ్ లో రౌడీకి ఫాలోవర్లతో పాటు రేటు కూడా రికార్డ్ రేంజ్ లో పెరిగిపోతోంది. రిలీజ్ కు ముందే బాలీవుడ్ లో మోత మోగించేస్తున్న లైగర్ భారీగా బిజినెస్ చేసింది.

షార్ట్ టైమ్ లోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుని పాన్ ఇండియా సినిమాలు లేకపోయినా అందరూ గుర్తించేలా ఎదిగాడు విజయ్ దేవరకొండ. తన స్టైల్ డిఫరెంట్ యాటిట్యూడ్ తో యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ రౌడీ అటు బాలీవుడ్ లో కూడా పిచ్చ క్రేజ్ సంపాదించుకున్నాడు. ఆ క్రేజ్ తోనే బాలీవుడ్ లో తన సినిమా లైగర్ కి కాసులు కురిపిస్తున్నాడు. రిలీజ్ అవ్వకముందే వందల కోట్ల బిజినెస్ తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు లైగర్.

Pawan Kalyan : మూడు నెలల్లో హరిహరవీరమల్లు అయిపోతుందా??

పూరీ జగన్నాధ్, విజయ్ దేవరకొండ కాంబినేషన్లో అనన్యపాండే హీరోయిన్ గా వస్తున్న లైగర్ రిలీజ్ కు ముందే రికార్డ్ రేంజ్ లో బిజినెస్ చేస్తోంది. ఆల్రెడీ 200 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి సినిమా మీద అంచనాలు పెంచేసింది లైగర్ మూవీ. ఇప్పటికే తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ ధియేట్రికల్ బిజినెస్ 120 కోట్లు జరిగినట్టు సమాచారం. ఓటీటీ హాట్ స్టార్ 65 కోట్లకు, మ్యూజిక్ రైట్స్ సోనీ 14 కోట్లకు సేల్ అయినట్లు తెలుస్తుంది. ఇక శాటిలైట్ రైట్స్ కూడా అధిక ధరకి ఓ టాప్ ఛానల్ కి అమ్మేసినట్టు తెలుస్తుంది. దీంతో పూరీకి, విజయ్ దేవరకొండకు కెరీర్ బెస్ట్ బిజినెస్ గా రికార్డ్ క్రియేట్ చెయ్యబోతోంది లైగర్ మూవీ. ఈ క్రేజీ కాంబినేషన్ మీద కాన్ఫిడెన్స్ తోనే కాకుండా లైగర్ సినిమా అవుట్ పుట్ చూసి ఫుల్ ఇంప్రెస్ అవుతున్నారు బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్లు. యాంగ్రీ యంగ్ మెన్ గా, పవర్ ఫుల్ యాక్షన్ తో కనిపిస్తున్న విజయ్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చెయ్యడం గ్యారంటీ అంటున్నారు డిస్టిబ్యూటర్లు. దాంతో మాంచి రికార్డ్ రేంజ్ లో లైగర్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని తెలుస్తుంది. మరి సినిమా రిలీజ్ అయ్యాక ఏ రేంజ్ లో కలెక్షన్స్ కొల్లగొడతాడో చూడాలి ఈ రౌడీ స్టార్.