‘మజిలీ’ డైరక్టర్ తో దేవరకొండ
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్, దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెండ్ హీరో.

యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్, దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెండ్ హీరో.
యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం టాలీవుడ్, దర్శక నిర్మాతలకు మోస్ట్ వాంటెండ్ హీరో. అర్జున్ రెడ్డి, గీత గోవిందం చిత్ర విజయాలతో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోగా మారిపోయాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం డియర్ కామ్రేడ్. ప్రస్తుతం ఈ సినిమా పనుల్లో బిజీగా ఉన్న ఈ యంగ్ హీరో, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటించేందుకు సిద్ధమవుతున్నాడు.
ఈ సినిమాతో పాటు తమిళ డైరెక్టర్ ఆనంద్ దర్శకత్వంలో ఓ స్పోర్ట్స్ డ్రామా కూడా ప్రారంభమైంది. అంతేకాదు నిన్నుకోరి సినిమా తరువాత మజిలీతో మరో హిట్ సాధించిన శివా నిర్వాణ దర్శకత్వంలో కూడా విజయ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుందట. మరి శివా విజయ్ కోసం ఎలాంటి కథను రెడీ చేశాడో చూడాలి.
Read Also : ‘జెర్సీ’ మూవీ ట్రైలర్, ప్రీ రిలీజ్ కు టైం ఫిక్స్