Vijay Devarakonda: లైగర్ కోసం రౌడీ ఎంతపుచ్చుకున్నాడంటే?

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా లైగర్ సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది.

Vijay Devarakonda: లైగర్ కోసం రౌడీ ఎంతపుచ్చుకున్నాడంటే?

Vijay Devarakonda Remuneration For Liger Movie

Vijay Devarakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటిస్తున్న తాజా చిత్రం ‘లైగర్’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఈ సినిమాను క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ తెరకెక్కిస్తుండగా, పాన్ ఇండియా మూవీగా లైగర్ సాలిడ్ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Liger: ఊరమాస్ ట్రీట్‌గా లైగర్ కోకా 2.0 పాట!

ఇప్పటికే రిలీజ్ అయిన లైగర్ పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలను డబుల్ చేశాయి. ఇక ఈ సినిమా ప్రమోషన్స్‌లో లైగర్ టీమ్ చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. దేశవ్యాప్తంగా ఈ సినిమాకు ఓ రేంజ్‌లో హైప్ తీసుకొచ్చారు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ ఓ బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. దీంతో ఈ సినిమాను నేషన్ వైడ్‌గా అదిరిపోయే క్రేజ్ ఏర్పడింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్‌గా నటిస్తుండటంతో ఈ సినిమాలో విజయ్-అనన్యాల జోడీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా కోసం వీరిద్దరు ఎంత రెమ్యునరేషన్ పుచ్చుకున్నారనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

Liger: పక్కా దేశీ స్టైల్‌లో కేక పెట్టిస్తున్న లైగర్!

లైగర్ సినిమా కోసం విజయ్ దేవరకొండ ఏకంగా రూ.35 కోట్ల రెమ్యునరేషన్ పుచ్చుకున్నాడని తెలుస్తోంది. అటు హీరోయిన్‌గా నటించిన అనన్యా పాండే ఈ సినిమా కోసం రూ.3 కోట్ల మేర రెమ్యునరేషన్ తీసుకుందట. అటు ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఈ సినిమా కోసం ఎంత పుచ్చుకున్నాడనేది ఇంకా సస్పెన్స్‌గా మిగిలింది. ఏదేమైనా తనకున్న క్రేజ్ కారణంగానే విజయ్ దేవరకొండ ఈ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నాడని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.