అభిమానులకు దీపావళి గిఫ్ట్.. మాస్టర్‌గా విజయ దళపతి

అభిమానులకు దీపావళి గిఫ్ట్.. మాస్టర్‌గా విజయ దళపతి

Vijay: విజయ దళపతి.. విజయ సేతుపతి కాంబినేషన్‌లో దీపావళి గిఫ్ట్ ఇవనున్నాడు లోకేశ్ కనగరాజ్. హీరో విజయ్ 65వ సినిమా అప్‌డేట్స్ గురించి ఆతురతగా ఎదురుచూస్తున్న అభిమానులకు టీజర్ రిలీజ్ చేసి ఖుషీ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. బోలెడ్ సందిగ్ధతల తర్వాత మూవీ అప్ డేట్ ప్రకటించారు మేకర్స్.

నవంబర్ 14న దీపావళి కానుకగా మాస్టర్ టీజర్ విడుదల చేస్తున్నాం. అవును అని ప్రొడక్షన్ హౌజ్ ట్వీట్ చేసింది. సాయంత్రం 6గంటలకు @SuntvYoutube ఛానెల్ లో చూసి ఎంజాయ్ చేయండి అంటూ ట్వీట్ చేసింది.దీనిపై అడ్వాన్స్ గిఫ్ట్ కూడా ఇచ్చారు. విజయ్ సేతుపతి, విజయ్ కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేసి ట్రీట్ ఇచ్చాడు లోకేశ్. ‘ఫైనల్‌గా మాస్టర్ వచ్చేశాడు’ అని దానికి క్యాప్షన్ పెట్టాడు. ప్రాజెక్ట్ అనౌన్స్ చేసినప్పటి నుంచి మాస్టర్ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారింది. కొవిడ్-19 కారణంగా సినిమా రిలీజ్ వాయిదాపడింది. ఎట్టకేలకు ఏప్రిల్ నాటికి రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.

గ్జేవియర్ బ్రిట్టో నిర్మాణంలో హోం బ్యానర్ ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్స్ సమర్పణలో సినిమా రెడీ అవుతోంది. ఇందులో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనుండగా, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్ రోల్ లో కనిపించనున్నారు. ఆండ్రియా జెరెమియా, అర్జున్ దాస్, శాంతను భాగ్యరాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. స్టోరీ విషయానికొస్తే కాలేజీ డ్రామా అని సమాచారం. మ్యూజిక్ అనిరుధ్ అందిస్తున్నారు.