Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ కోసం వస్తున్న విజయ్

తమిళ నటుడు విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ టీజర్ ను స్టార్ హీరో విజయ్ రిలీజ్ చేయనున్నాడు.

Mark Antony: విశాల్ ‘మార్క్ ఆంటోని’ కోసం వస్తున్న విజయ్

Vijay To Launch Vishal Mark Antony Teaser

Mark Antony: తమిళ హీరో విశాల్ నటిస్తున్న తాజా చిత్రం ‘మార్క్ ఆంటోని’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు అదిక్ రవిచంద్రన్ డైరెక్ట్ చేస్తుండగా, పూర్తి యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఇక ఈ సినిమా నుండి టీజర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు.

Vishal Mark Antony : విశాల్ కొత్త మూవీ షూటింగ్‌లో యాక్సిడెంట్.. వైరల్ అవుతున్న వీడియో!

మార్క్ ఆంటోని టీజర్‌ను ఇవాళ సాయంత్రం 6.30 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. కాగా, ఈ టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ చేతుల మీదుగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. మార్క్ ఆంటోని మూవీలో విశాల్ సరికొత్త గెటప్‌లో కనిపిస్తుండగా, తెలుగు యాక్టర్ సునీల్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. వర్సెటైల్ యాక్టర్ ఎస్.జె.సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. అందాల భామ రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాకు జివి.ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

Vishal : గుండె పై ఆ నాయకుడు టాటూ వేయించుకున్న విశాల్..

ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో వస్తున్న మార్క్ ఆంటోని మూవీ టీజర్ ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను వినోద్ కుమార్ ప్రొడ్యూస్ చేస్తుండగా, తమిళ్‌తో పాటు తెలుగులోనూ ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.