Vijayendra Prasad : గాంధీని విమర్శించే విజయేంద్ర ప్రసాద్.. గాంధీనే తనకి స్ఫూర్తి అంటున్నాడు..

గాంధీని విమర్శించే ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. గాంధీనే తనకి స్ఫూర్తి అంటూ వెల్లడిస్తున్నాడు. 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి. కాగా ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హాజరయ్యారు. ఇక ఈ వేడుకలో.. "రచయితల వల్లే యాక్టర్స్‌కి , యాంకర్స్‌కి మనుగడ ఉంటుంది. కాబట్టి కాబోయే రైటర్లకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?" అని అడిగిన వ్యాఖ్యాత ప్రశ్నకు...

Vijayendra Prasad : గాంధీని విమర్శించే విజయేంద్ర ప్రసాద్.. గాంధీనే తనకి స్ఫూర్తి అంటున్నాడు..

Vijayendra Prasad says Gandhi is his inspiration

Vijayendra Prasad : గాంధీని విమర్శించే ఇండియన్ స్టార్ రైటర్ విజయేంద్ర ప్రసాద్.. గాంధీనే తనకి స్ఫూర్తి అంటూ వెల్లడిస్తున్నాడు. 53వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం వేడుకలు ఆదివారం గోవాలో ఘనంగా మొదలయ్యాయి. ఈ చలన చిత్రోత్సవం వేడుకలు ఈ నెల 28 వరకు కొనసాగనుంది. కాగా ఈ సెలెబ్రేషన్స్ కి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ హాజరయ్యారు.

Pawan Kalyan : అన్నయ్య కీర్తి కిరీటంలో చేరిన మరొక వజ్రం.. పవన్ కళ్యాణ్!

బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్ సినిమాలతో దేశవ్యాప్తంగా ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నాడు విజయేంద్ర ప్రసాద్. ఇక ఈ వేడుకలో.. “రచయితల వల్లే యాక్టర్స్‌కి , యాంకర్స్‌కి మనుగడ ఉంటుంది. కాబట్టి కాబోయే రైటర్లకు మీరు ఎలాంటి సలహా ఇస్తారు?” అని అడిగిన వ్యాఖ్యాత ప్రశ్నకు, విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన సమాధానం విని వేడుకలోని అతిథులంతా విరగబడి నవ్వారు.

తన జేబులో నుంచి రూ.100 నోటు తీసి, నోటు మీద ఉన్న గాంధీజీని చూపిస్తూ.. “గాంధీ నాకు స్ఫూర్తి” అంటూ వెల్లడించాడు. డబ్బు అవసరం మనకి అన్ని నేర్పిస్తుంది అనే భావంతో అయన మాట్లాడాడు. దీంతో సభాప్రాగణం అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. ఇక ఇదే వేడుకల్లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవికి “ఇండియన్ ఫిల్మ్ పర్సనాల్టీ ఆఫ్ ది ఇయర్ 2022”గా అరుదైన గౌరవం దక్కింది.