Vishwak Sen : అనుకోకుండా అన్నాను అంటూ.. సారీ చెప్పిన విశ్వక్ సేన్..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ యువకుడితో కలిసి నడిరోడ్డు మీద ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలయ్యారు విశ్వక్సేన్. నడిరోడ్డు మీద ఏంటి ఈ న్యూసెన్స్...................

Vishwak Sen : అనుకోకుండా అన్నాను అంటూ.. సారీ చెప్పిన విశ్వక్ సేన్..

Vishwak

Vishwak Sen :  యువ హీరో విశ్వక్​ సేన్ తన నెక్స్ట్ సినిమా ‘అశోకవనంలో అర్జున కల్యాణం’ మే 6న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో వరుసగా సినిమా ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా ఓ యువకుడితో కలిసి నడిరోడ్డు మీద ప్రాంక్ వీడియో చేసి విమర్శల పాలయ్యారు విశ్వక్సేన్. నడిరోడ్డు మీద ఏంటి ఈ న్యూసెన్స్ అంటూ విశ్వక్ ని ట్రోల్ చేశారు. ఇది బాగా వైరల్ అవడంతో ఓ ఛానల్ విశ్వక్ తో పాటు మరొకరిని దీనిపై చర్చించడానికి పిలిచారు.

 

ఈ డిబేట్ లో యాంకర్​కు విశ్వక్​ సేన్​ మధ్య మాటల యుద్ధం జరిగింది. దీంతో యాంకర్ విశ్వక్​ సేన్​ను స్టూడియో నుంచి ‘గెట్​ అవుట్’​ అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళిపోమంది. విశ్వక్ కూడా ఓ అసభ్యకరమైన పదం వాడుతూ అరుస్తూ వెళ్ళిపోయాడు. దీంతో ఈ వీడియో వైరల్ అయింది. తాజాగా ఈ సంఘటన జరిగిన తర్వాత సినిమా ప్రెస్ మీట్ పెట్టగా ఇందులో విశ్వక్ ని మీడియా ప్రతినిధులు దీనిపై ప్రశ్నించారు.

Upasana : 150 వృద్ధాశ్రమాలకు అండగా నిలవనున్న ఉపాసన

దీనికి స్పందించిన విశ్వక్సేన్.. ఆ వీడియో అలా నెగిటివ్ గా వెళ్లడం, తర్వాత ఇంటర్వ్యూలో అలా జరగడం ఇదంతా కావాలని చేసింది కాదు, అంతా అలా జరిగిపోయింది. మీడియాలో అలాంటి పదాన్ని వాడటం, అలా మాట్లాడటం తప్పే, అనుకోకుండా ఫ్లోలో ఆ మాట వచ్చిందని సారీ చెప్పాడు.