లాక్‌డౌన్‌కు ఏడాది : కరోనా పుట్టినిల్లు ‘వుహాన్ వైరస్’ మూవీ రిలీజ్

లాక్‌డౌన్‌కు ఏడాది : కరోనా పుట్టినిల్లు ‘వుహాన్ వైరస్’ మూవీ రిలీజ్

Wuhan virus outbreak film : కరోనా మహమ్మారికి పుట్టినిల్లు అయిన చైనాలోని వుహాన్ నగరంపై ఓ కొత్త మూవీ రిలీజ్ అయింది. వుహాన్‌లో 76 రోజుల లాక్‌డౌన్‌ విధించి ఏడాది పూర్తయిన సందర్భంగా చైనా వార్షికోత్సవ సంబరాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా వుహాన్ వైరస్ చీకటి రోజులను గుర్తు చేస్తూ ‘డేస్‌ అండ్‌ నైట్స్‌ ఇన్‌ వుహాన్‌’ అనే డాక్యుమెంటరీ మూవీని నిర్మించింది అక్కడి ప్రభుత్వం. ఇప్పుడా ఆ మూవీని లాక్ డౌన్ యానివర్శరీ రోజున చైనాలో రిలీజ్ చేసింది.

ఇందులో కరోనా మహమ్మారితో చైనా పోరాడి విజయం ఎలా సాధించింది అనేది కళ్లకు కట్టినట్టుగా చూపించారు. మహమ్మారిపై విజయం సాధించిన వుహాన్‌ సిటీపై ప్రశంసలు కురిపించింది. డిసెంబర్‌ 2019లో వుహాన్‌లో కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు చైనా జనవరి 23, 2020 నుంచి లాక్‌డౌన్‌ విధించిన సంగతి తెలిసిందే. వుహాన్ సిటీలో రూ.కోటి 10 లక్షల నగర పౌరులు, వైద్యారోగ్య, ప్రభుత్వ సిబ్బంది పడిన కష్టాలను దర్శకుడు కావో జిన్‌లింగ్‌ మూవీలో తెరకెక్కించారు.

ఈ మూవీకి సంబంధించి ఇదివరకే ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. వుహాన్ లో లాక్ డౌన్ విధించి ప్రపంచానికి తామెంతో మహోపకారం చేశామని చైనా ఈ చిత్రం చూపించింది. వుహాన్ సినిమా విదేశాల్లో కూడా ఆడుతుందా లేదా అనేది స్పష్టత లేదు.