Yadamma Raju : ప్రియురాలితో యాదమ్మ రాజు నిశ్చితార్థం..

పటాస్ షోతో ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు 'యాదమ్మ రాజు'. తన ప్రత్యేకమైన భాష శైలితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. తాజాగా ఈ కమెడియన్ తన ప్రేమించిన ప్రియురాలితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు.

Yadamma Raju : ప్రియురాలితో యాదమ్మ రాజు నిశ్చితార్థం..

Yadamma Raju engagement with his girlfriend

Yadamma Raju : టాలెంట్ ఉన్న దాని ఎలా, ఎక్కడ ప్రదర్శించాలో తెలియని ఎంతోమంది నటులకు జబర్దస్త్, పటాస్ వంటి కామెడీ షోలు.. జీవితాన్ని అందిస్తున్నాయి. వారికే కాదు, సినీ పరిశ్రమలో కొత్త నటులను కోరుకునే దర్శకనిర్మాతలకు కూడా ఈ ప్లాట్ ఫార్మ్ ఒక వేదిక అయ్యింది. అలా వచ్చే నేడు సుడిగాలి సుధీర్, గెట్ అప్ శ్రీను, హైపర్ అది వంటి వారు సినిమా పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు.

Yadamma: నన్ను ఎవరూ అడ్డుకోలేదు.. ఆ వార్తలను ఖండించిన వంటల స్పెషలిస్ట్ యాదమ్మ

ఈ వరుసలోనే పటాస్ షోతో ఫేమ్ ని సంపాదించుకున్న నటుడు ‘యాదమ్మ రాజు’. తన ప్రత్యేకమైన భాష శైలితో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతో గుర్తింపుని సంపాదించుకున్నాడు. తాజాగా ఈ కమెడియన్ తన ప్రేమించిన ప్రియురాలితో కలిసి పెళ్లి పీటలు ఎక్కబోతున్నాడు. నేడు ప్రియురాలు ‘షార్లీ స్టెల్లా’కి ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగి వారి ప్రేమ ప్రయాణానికి జీవితాంతం నడిచేలా చేసుకొన్నాడు.

కుటుంబ సభ్యులు మరియు ముఖ్యమైన స్నేహితులు మధ్య ఈ నిశ్చితార్ధ వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందుకు సంబందించిన ఫోటోలను యాదమ్మ రాజు తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. కాగా ఈ మధ్యకాలంలో ఈ ప్రేమ జంట పలు టెలివిజన్ కామెడీ షోలో కనిపించిన విషయం తెలిసిందే.

View this post on Instagram

A post shared by YADAMMA RAJU (@yadamma_raju)