Yash : బ్రహ్మాస్త్రలో KGF యశ్?? సూపర్ గాసిప్.. నిజం అయితే..

ఇటీవల బాలీవుడ్ లో విడుదలై పర్వాలేదనిపించుకున్న భారీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి భారీ తారాగణంతో అయాన్ ముఖర్జీ మలిచిన సోషియో మైథలిజికల్ ఫాంటసీ మూవీ..........

Yash : బ్రహ్మాస్త్రలో KGF యశ్?? సూపర్ గాసిప్.. నిజం అయితే..

Yash will play a role in Bollywood Brahmastra gossip goes viral

Yash :  సౌత్ సినిమాల సక్సెస్ తో, బాలీవుడ్ వరుస పరాజయాలతో బాలీవుడ్ మేకర్స్ సౌత్ స్టార్స్ ని కూడా తమ సినిమాల్లోకి తీసుకొని సౌత్ లో కూడా వీర లెవల్లో ప్రమోషన్స్ చేసి డబ్బులు సంపాదించాలని చూస్తున్నారు. ఇటీవల బ్రహ్మాస్త్ర సినిమా ఇదే చేసింది. నాగార్జునతో ఓ క్యారెక్టర్ చేయించి, చిరంజీవితో వాయిస్ చెప్పించి, రాజమౌళితో ప్రమోషన్స్ చేశారు.

అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా కూడా నాగ చైతన్యని సినిమాలోకి తీసుకొని, చిరంజీవి, నాగార్జునలతో ప్రమోట్ చేయించారు. సల్మాన్ ఖాన్ రాబోయే సినిమాలో వెంకటేష్, రామ్ చరణ్ గెస్ట్ పాత్రల్లో నటిస్తున్నారు. కొంతమంది బాలీవుడ్ హీరోలు సౌత్ డైరెక్టర్స్ కి ఛాన్సులు ఇస్తున్నారు. ఇలా బాలీవుడ్ అంతా సౌత్ స్టార్స్ ఇమేజ్ లని వాడుకోవాలని చూస్తున్నాయి. తాజాగా బాలీవుడ్ లో మరో ఆసక్తికర గాసిప్ వినిపిస్తుంది.

పాన్ ఇండియా స్థాయిలో మల్టీ లాంగ్వేజెస్ లో భారీ ఎత్తున నిర్మాణం జరుపుకున్న కన్నడ మూవీ ‘కెజీఎఫ్’. ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజై ఈ సినిమా సెన్సేషనల్ హిట్టయింది. అంతకు ముందు ఎవరో కూడా తెలియని కన్నడ స్టార్ యశ్ ఈ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో పాపులర్ అయ్యాడు. ఈ సినిమా క్రేజ్ తో అంచనాలకు మించి సెకండ్ పార్ట్ భారీ సక్సెస్ అయింది. బాలీవుడ్ లో సైతం ఈ సినిమా రికార్డు కలెక్షన్స్ రాబట్టింది. కెజీఎఫ్ సిరీస్ తో యశ్ ఇండియన్ వైడ్ గా పాపులర్ స్టార్ అయిపోయాడు. ఇప్పుడు యశ్ క్రేజ్ ను బాలీవుడ్ మేకర్స్ క్యాష్ చేసుకొనే ప్రయత్నాలు మొదలు పెట్టారు.

ఇటీవల బాలీవుడ్ లో విడుదలై పర్వాలేదనిపించుకున్న భారీ సినిమా ‘బ్రహ్మాస్త్ర’. రణబీర్ కపూర్, ఆలియా భట్, అమితాబ్ బచ్చన్, నాగార్జున లాంటి భారీ తారాగణంతో అయాన్ ముఖర్జీ మలిచిన సోషియో మైథలిజికల్ ఫాంటసీ మూవీ ‘బ్రహ్మాస్త్ర’. పురాణాల్లోని అస్త్రాల అంశాన్ని నేటి టెక్నాలజీకి లింక్ చేస్తూ రూపొందిన ఈ సినిమా రిజల్ట్ బాలీవుడ్ కు కాస్తైనా ఊరట కలిగించింది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ పార్ట్ ‘దేవ్’ పై ఫోకస్ పెట్టాడు దర్శకుడు. ఫస్ట్ పార్ట్ లో నటించిన అందరి స్టార్స్ తో పాటు మరో సౌత్ స్టార్ ను కూడా ఈ సినిమాలో ఎంపిక చేస్తున్నారు మేకర్స్. అతడు మరెవరో కాదు యశ్. ఇందులో దేవ్ కేరక్టర్ లో యశ్ నటించబోతున్నట్టు టాక్. మొదటి పార్ట్ కు నాగార్జున ఎలా ప్లస్ అయ్యాడో రెండో పార్ట్ కు యశ్ క్రేజ్ ను క్యాష్ చేసుకోబోతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ వార్త బాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.

Movies : కోట్లు కురిపిస్తున్న మాఫియాలు.. మాఫియాల కథల మీదే సినిమాలు..

ఇదే నిజమైతే కనుక యశ్ కి బాలీవుడ్ ఎంట్రీ చాలా ఈజీ అవుతుంది. బ్రహ్మస్త్రకి కన్నడలో కూడా భారీ మార్కెట్ అవుతుంది. కలెక్షన్స్ కూడా భారీగా వచ్చే ఆవకాశం ఉంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.