Movies : కోట్లు కురిపిస్తున్న మాఫియాలు.. మాఫియాల కథల మీదే సినిమాలు..

ఇలా ఇటీవల వస్తున్న సినిమాలు, రాబోయే సినిమాలు మాఫియా నేపథ్యంతో వస్తున్నాయి. డ్రగ్, ల్యాండ్, మెడికల్, అమ్మాయిల రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, మద్యం మాఫియా .. ఇలా అనేకరకాల సమస్యలని తీసుకొని వాటికి కమర్షియల్ అంశాలు జోడించి..........

Movies : కోట్లు కురిపిస్తున్న మాఫియాలు.. మాఫియాల కథల మీదే సినిమాలు..

Movies : సామాజిక సమస్య, దాన్ని వెంటాడుతున్న మాఫియా నేపథ్యం. ఇప్పుడు సౌత్ లో సక్సెస్ ఫార్ములా ఇదే. ఈ మధ్యకాలంలో ఈ థీమ్ తో తెరకెక్కిన సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో ఇప్పుడు ఇదే స్టోరీ లైన్ మీద పడ్డారు మిగతా డైరెక్టర్స్. ఒక్కోసారి ఒక్కో ఫార్ములా వర్కవుట్ అవుతూంటుంది. అయితే ఎంత స్ట్రాంగ్ గా డైరెక్టర్ దాన్ని యూజ్ చేసుకున్నాడు అన్నదానిపైనే దాని సక్సెస్ ఆధారపడి ఉంటుంది. ఈ మధ్యకాలంలో సక్సెస్ కు కేరాఫ్ అడ్రెస్ గా మారిన ఫార్ములా మాత్రం మాఫియా నేపథ్యం. సివిలియన్స్ కు ఒక ప్రాబ్లెమ్ వస్తుంది. దాని చుట్టూ వలయంలా మాఫియా కమ్మేస్తుంది. హీరో దానికి సొల్యూషన్ చూపిస్తాడు. ఇప్పుడు ఇదే థీమ్ తో అనేక సినిమాలు వచ్చాయి, వస్తున్నాయి.

ఇటీవల సెన్సేషన్ గా నిలిచినా కన్నడ సినిమా కాంతార ల్యాండ్ మాఫియా మీద తీశారు. తమ పూర్వికుల కాలం నుంచి భూమినే నమ్ముకొని జీవిస్తున్న గిరిజనుల నుంచి ఆ భూమిని లాక్కునే కుట్ర వారికి తెలియకుండానే జరుగుతుంటుంది. తమ కళతో భగవంతుడ్ని సేవించుకుంటున్న ఆ అమాయకులను హీరో ఎలా కాపాడతాడు? తమ భూమిని వారు ఎలా సొంతం చేసుకున్నారు అనే కథాంశంతో కాంతార సినిమా తెరకెక్కింది. అద్భుతమైన కథాకథనాలతో, షాకింగ్ క్లైమాక్స్ తో, అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో కాంతార సినిమా ఆడియన్స్ కు సరికొత్త అనుభూతినిచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా జోరు ఇంకా తగ్గలేదు. ల్యాండ్ మాఫియా నేపథ్యంలో సరికొత్త ప్రజెంటేషన్ తో ఆద్యంతం ఆకట్టుకుంటోంది కాంతార.

ఈ దీపావళి కానుకగా విడుదలైన తమిళ మూవీ ‘సర్దార్’. అదే పేరుతో ఈ మూవీ తెలుగులో కూడా విడుదలైంది. తండ్రీ కొడుకులుగా కార్తి డ్యూయల్ రోల్ ప్లే చేసిన ఈ సినిమాని PS మిత్రన్ డైరెక్ట్ చేశాడు. ప్రాణకోటికి ఫ్రీగా దొరికే వాటర్ ను కమర్షియల్ గా మార్చేసి దాంతో కొన్ని లక్షల కోట్లను దోచుకోవాలనుకొనే మాఫియా ముఠాకి ఓ సీక్రెట్ స్పై ఎలా అడ్డు తగిలాడు అన్న కథాంశంతో ఈ సినిమా తెరకెక్కింది. ప్లాస్టిక్ బాటిల్స్ తో వాటర్ తాగడం ఎంత డేంజరో అన్న విషయం ఈ సినిమాతో అర్ధమవుతుంది. ఎంతో ఇంట్రెస్టింగ్ పాయింట్ తో ఇన్ఫర్మేటివ్ గా రూపొందిన ఈ సినిమా దీపావళి సినిమాల్లో నెం.1 గా రన్ అవుతోంది. హీరో ఎలివేషన్స్, ట్విస్ట్స్ ఈ మూవీకి హైలైట్ పాయింట్స్. వాటర్ మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా అదరగొడుతోంది.

ఈ ప్రపంచాన్ని వేధిస్తోన్న మరో సమస్య డ్రగ్ పెడ్ లింగ్. దీని వల్ల యూత్ నాశనమైపోతోంది. ఈ ప్రాబ్లెమ్ ను సాల్వ్ చేయాలంటే మాఫియాను కూకటి వేళ్ళతో పెకలించాలి. దానికోసం ఎప్పటి నుంచో సీక్రెట్ ఏజెంట్ గా ఉన్న విక్రమ్ ఈ ఆపరేషన్ లో తన కొడుకును పొగొట్టుకొని మళ్లీ ఏజెంట్ గా యాక్టివేట్ అవుతాడు. కమల్ హాసన్ హీరోగా నటించిన ఆ సినిమా ‘విక్రమ్’. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రికార్డ్ కలెక్షన్స్ సాధించింది. ఎప్పటి నుంచో సరైన హిట్స్ లేని కమల్ హాసన్ ఈ మూవీతో తిరిగి సూపర్ ఫామ్ లోకి వచ్చారు. ఏజెంట్ విక్రమ్ గా కమల్ విశ్వరూపం చూపించారు. ఫహద్ ఫాజిల్ , విజయ్ సేతుపతి ఈ సినిమాకి మరింతగా బలమయ్యారు. డ్రగ్ మాఫియాని అంతం చేయాలనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయం సాధించింది.

సమంత నటించిన లేటెస్ట్ మూవీ యశోద మెడికల్, సరోగసి మాఫియా నేపథ్యంలో తెరకెక్కింది. ప్రస్తుతం సమంత శాకుంతలం, యశోద, ఖుషీ సినిమాల్లో నటిస్తోంది. వీటిలో ‘యశోద’ ఓ థ్రిల్లర్ మూవీ. హరి అండ్ హరీష్ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీ మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ లో థ్రిల్లింగ్ యాస్పెక్ట్స్ తో తీసిన సినిమా. ఇందులో సామ్ సరోగేట్ మదర్ గా వెరైటీ రోల్ చేసింది. వేరే వారికి సరోగేట్ మదర్ అయ్యే ప్రయత్నంలో గర్భం ధరించి ఒక హాస్పిటల్ లోకి చేరిన యశోదకి ఓ భయంకరమైన నిజం తెలుస్తుంది. సరోగసీ విధానంతో ఆ ఆసుపత్రి ఏదో మాఫియా గుప్పిట్లో ఉందని తెలుసుకుంటుంది. అసలు ఆ ఆసుపత్రిలో ఏం జరుగుతోంది. సరోగసీతో కోట్లు కొల్లగొట్టే పెద్ద మనుషులు ఎవరు? అనే సత్యాన్ని వెలికితీసే ప్రయత్నంలో తన ప్రాణాన్ని కూడా లెక్కచేయకుండా ఒంటరిగా పోరాడుతుంది యశోద. థ్రిల్లింగ్ సీన్స్ తో అడుగడుగునా ప్రేక్షకుల్ని ఉత్కంఠకు గురి చేయబోతోంది ఈ సినిమా. వచ్చే నెల 11న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో మల్టిపుల్ లాంగ్వేజెస్ లో రిలీజ్ కాబోతోంది. మరి ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అవుతుందో చూడాలి.

Puneeth Rajkumar : పునీత్ రాజ్‌కుమార్‌కి కర్ణాటక రాష్ట్ర అవార్డు.. అతిధులుగా ఎన్టీఆర్, రజినీకాంత్..

ఇలా ఇటీవల వస్తున్న సినిమాలు, రాబోయే సినిమాలు మాఫియా నేపథ్యంతో వస్తున్నాయి. డ్రగ్, ల్యాండ్, మెడికల్, అమ్మాయిల రవాణా, హ్యూమన్ ట్రాఫికింగ్, మద్యం మాఫియా .. ఇలా అనేకరకాల సమస్యలని తీసుకొని వాటికి కమర్షియల్ అంశాలు జోడించి సరికొత్తగా సినిమాలు తెరకెక్కిస్తూ సక్సెస్ అవుతున్నారు.