Ayodhya Ram Temple,Shaligram stones : అయోధ్య సీతారాముల విగ్రహాల కోసం నేపాల్‌‌ నుంచి వస్తున్న శాలిగ్రామ్ రాళ్లు..వీటి ప్రత్యేక ఏమంటే..

అయోధ్య సీతారాముల విగ్రహాల కోసం నేపాల్‌ నుంచి బయలుదేరి భారత్ కు రానున్న శాలిగ్రామ్ రాళ్లు..ఈ రాళ్ల ప్రత్యేక ఏమంటే..

Ayodhya Ram Temple,Shaligram stones : అయోధ్య సీతారాముల విగ్రహాల కోసం నేపాల్‌‌ నుంచి వస్తున్న శాలిగ్రామ్ రాళ్లు..వీటి ప్రత్యేక ఏమంటే..

Ayodhya Ram Temple..Shaligram stones :

Ayodhya Ram Temple..Shaligram stones :  త్వరలోనే భక్తులకు దర్శనం ఇవ్వటానికి అయోధ్యలో రామ మందిరం అత్యద్భుతంగా రూపుదిద్దుకుంటోంది. 2024 జనవరికల్లా భక్తులకు రాముడి దర్శనం కల్పిస్తామని ఇప్పటికే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించారు. ఎప్పుడెప్పుడు అయోధ్యరామయ్యను కళ్లారా చూస్తామా? అని భక్తులు ఎంతో ఆకాంక్షతో ఎదురు చూస్తున్నారు. శరవేగంగా రామమందిర నిర్మాణ పనులు పూర్తి అవుతుండగా ఆలయంలో సీతారాముల విగ్రహాల కోసం ప్రత్యేకమైన రాళ్లను వినియోగించనున్నారు.

ఈ విగ్రహాలను రూపొందించేందుకు రాయి కూడా ప్రత్యేకమైనదే ఉండాలి. అత్యంత పవిత్రమైన శాలిగ్రామ రాళ్లతో సీతారాముల విగ్రహాలను రూపొందించనున్నారు. ఈ శాలిగ్రామాలను నేపాల్ నుంచి ప్రత్యేక ఏర్పాట్లతో అత్యంత పవిత్రంగా తీసుకొస్తున్నారు. నేపాల్‌లోని జనక్‌పూర్ నుంచి శాలిగ్రామ్ రాళ్ల (Shaligram stones) ను భారత్ పంపించేందుకు నేపాల్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.నేపాల్ లోని గండకీ నది శాలిగ్రామ రాళ్లకు ప్రసిద్ధి. గండకీ నదిలోని శాలిగ్రామాలు ఎంతో పవిత్రమైనవి. అటువంటి పరమ పవిత్రమైన శాలిగ్రామ రాళ్లతో మూడు అడుగుల పొడువుతో అయోధ్య సీతారామ విగ్రహాలను రూపొందించనున్నారు. దీంతో శాలిగ్రామాలు భారీ ట్రక్కుల్లో భారత్ కు తరలిరానున్నాయి. ఇప్పటికే నేపాల్ లో ఆదివారం (జనవరి 29,2023) శాలిగ్రామ రాళ్లతో ట్రక్కులు నేపాల్ నుంచి భారత్ కు బయలుదేరాయి. ఈ ట్రక్కులు బయలుదేరిన సమయంలో నేపాల్ లోని భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి వచ్చి శాలిగ్రామాలకు పూజలు చేశారు. పవిత్రమైన ఆ రాళ్లను తాకి భక్తితో పరవశించిపోయారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ శాలిగ్రామ్ రాళ్ల నుంచి శిల్పులు శ్రీరాముడు, సీతాదేవి విగ్రహాలను చెక్కుతారు. అయోధ్య రామమందిరంలోని ప్రధాన ఆలయ సముదాయంలో ఈ విగ్రహాలను కొలువుదీరుస్తారు. జానకీ రాముల విగ్రహాలను రూపొందించనున్న రెండు రాళ్లు వరుసగా 15 టన్నుల శాలిగ్రామ రాయి,23 టన్నుల మరో శాలిగ్రామ రాళ్లతో ట్రక్కులు నేపాల్ నుంచి భారత్ కు బయలుదేరాయి.అయోధ్యకు ఫిబ్రవరి 2న చేరుతాయి.

నేపాల్ నుంచే ఈ రాళ్లను ఎందుకు తీసుకొస్తున్నారు?
నేపాల్‌లోని గండకీ రాష్ట్రంలోని ముస్తాంగ్ జిల్లాలో ‘కలిగండకి’ నది నుంచి సేకరించిన శాలిగ్రామ్ రాళ్లకు విశిష్టత ఉంది. సీతాదేవి ఇక్కడే జన్మించిందని భక్తుల నమ్మకం. సీతాదేవి జనకమహారాజు కుమార్తె. అందుకే జానకీ అంటారు. జనక్‌పూర్‌లో జానకి మాత ఆలయం ఉంది. నేపాల్‌లో గండకీ నది ఉంది. ఈ నది శాతిగ్రామాలకు ప్రసిద్ది. ఈ శాలిగ్రామాలు చాలా పవిత్రమైనవిగా భావిస్తారు. అటువంటి శాలిగ్రామ్ రాళ్లతో సీతారాముల విగ్రహాలు రూపుదిద్దుకోనున్నాయి.

నేపాల్ మాజీ డిప్యూటీ ప్రధాని బిమలేంద్ర నిధి ఈ శిలలను భారత్‌కు పంపించేందుకు స్వయంగా బాధ్యత తీసుకున్నారు. జనక్‌పూర్ ఆయన స్వస్థలం. ‘ గండకి నదిలో లభించిన ఈ శిలలు ఎంతో పవిత్రమైనవి. ఈ శిలలను విష్ణు భగవానుడికి ప్రతిరూపాలుగా భావిస్తారు. విష్ణువు 10 అవతారాల్లో శ్రీరాముడు ఒక అవతారం. అందుకే అయోధ్య రామ మందిరంలో ఏర్పాటు చేసే విగ్రహాల కోసం గండకీ నదిలో లభ్యమయ్యే శాలిగ్రామ రాళ్లతోనే ఈ విగ్రహాలను రూపొందించాలని నిర్ణయించారు రామ జన్మ భూమి తీర్థ క్షేత్ర ట్రస్టు నిర్వాహకులు. ట్రస్టు ఛైర్మన్ విజ్ఞప్తి మేరకు నేపాల్ ప్రభుత్వం ఈ రాళ్లను భారత్ కు ఇవ్వటానికి అంగీకరించింది.

నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది.సాలగ్రామము విష్ణుప్రతీకమైనదనీ..విశిష్ట ప్రాముఖ్యం కలిగిన ఒక శిల. భక్తుల అర్చనాదుల సౌలభ్యం కోసం నారాయణుడు సాలగ్రామ రూపం ధరించాడని దేవీ భాగవతం చెబుతుంది. నేపాల్ లోని గండకీ నదిలో లభించే శాలిగ్రామాల్లో చాలా రకాలుంటాయి. నారాసింహ సాలగ్రామం, సుదర్శన సాలగ్రామం, హిరణ్య గర్భం…అని అంటారు. శ్రీ మహావిష్ణువు ‘వృంద ‘ అనే పతివ్రతా శాపానికి గురై, సాలగ్రామ రూపంగా మారిపోయారని పురాణా కథనాలు చెబుతున్నాయి. సాలాగ్రామ ఆరాధన శ్రీ వైష్ణవులకు అత్యంత ప్రాముఖ్యం.

ఈ సాలగ్రామాలు నలుపు రంగులో ఉంటాయి. రకరకాల ఆకృతుల్లో ఉంటాయి. శాలిగ్రామాలను మధ్యలోకి కట్ చేస్తే లోప శ్రీ విష్టును చక్రం ఆకారంలో ఉంటుంది. ఇంట్లో తిరువారాధనకు నలుపు రంగు సాలగ్రామాలు ఉండాలని పెద్దలు చెబుతుంటారు.వీటి సంఖ్యలో కూడా నిబంధనలుంటాయి. అంటే ఒక్కటే ఉండకూడదంటారు. ఒకటి కంటే ఎక్కువగా అంటే బేసి సంఖ్యలో ఉండాలి.

సాలగ్రామం పూజ శ్రేష్ఠమైనదిగా ఉంటుంది. నిష్ఠతో పూజ చేసి నైవేద్యం పెట్టాల్సి ఉంటుంది. ప్రతి రోజూ తిరువారాధన చేయాలి. ఈ శాలిగ్రామాలు ఉన్న ఇంట్లో రజస్వలా నియమాలు , జాత, మృత అసౌచాలు తప్పనిసరిగా పాటించాలి. ఇల్లు వదలి వెళ్లాల్సి వస్తే సమీపంలోని ఏదైనా దేవాలయంలో నిత్య పూజ జరిగే ఏర్పాటు చేసి వెళ్ళాలి. అంతే తప్ప ఒక్కరోజు కూడా వీటికి ఆరాధన జరకుండా ఉండకూడదని పండితులు చెబుతుంటారు. గవదనుగ్రహం, ఎన్నో జన్మల పుణ్య సంచయం ఉంటే తప్పా, సాలగ్రామం ఇంటిలో ఉండడం, తిరువారాధన చేయగలగడం సాధ్య పడదు అంటారు పండితులు. ఇన్ని నియమ నిబంధనలు ఉంటాయి శ్రీ విష్ణు స్వరూపమైన శాలిగ్రామాల పూజలకు. అటువంటి పవిత్రమైన రాళ్లతో అయోధ్య సీతారాముల విగ్రహాలు రూపు దిద్దుకోనున్నాయి. భక్తులకు దర్శనమివ్వనున్నాయి.