ప్రైవేట్ ఉద్యోగులకు హెచ్చరిక: PAN-Aadhaar జత చేయకుంటే 20శాతం శాలరీ కట్

ప్రైవేట్ ఉద్యోగులకు హెచ్చరిక: PAN-Aadhaar జత చేయకుంటే 20శాతం శాలరీ కట్

ఎవరైతే సంవత్సరానికి రూ.2.5లక్షలు సంపాదిస్తున్నారో వారు పాన్ కార్డుతో ఆధార్ జత చేయకపోతే ఇక చిక్కుల్లో పడ్డట్లే. ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్ కొత్త రూల్స్ ఇష్యూ చేసింది. పాన్ కార్డుకు ఆధార్‌ను అనుసంధానం చేయకపోతే జీతంలో నుంచి 20శాతాన్ని పన్నుకింద కట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఇది ఇప్పటికే అమలులోకి వచ్చేసింది జనవరి 16నుంచి ఎవరికైతే పాన్.. ఆధార్ జత చేసిలేదో వారి జీతాల్లో నుంచి 20శాతంపన్ను హాంఫట్. 

ఇన్‌కమ్ ట్యాక్స్ సెక్షన్ 206-ఏఏ ప్రకారం.. పాన్ కు ఆధార్ జత చేయడం తప్పనిసరి అని చెబుతుంది. 2018-19ఆర్థిక సంవత్సరంలో మొత్తం పన్ను 37శాతమే వసూలు అయింది. ఇప్పటికే జీతంలో అన్ని ట్యాక్సులకు కలిపి 20శాతం కట్ అవుతుంటే మళ్లీ టీడీఎస్ 20శాతం కటింగ్ వర్తిస్తుంది. 

ఒకవేళ మీ జీతంలో 30శాతం ట్యాక్స్ రేట్ కట్ అవుతుంటే మీ కంపెనీ ద్వారా ఈ వివరాలు అప్ డేట్ చేయించుకుని వార్షిక ఆధాయంతో పోల్చుకుంటే మీకు 20శాతమే కోత పడుతుంది. ఎందుకంటే చాలా మంది చదువులకు, ఆరోగ్యానికి సంబంధించిన అంశాలకు 4శాతం ట్యాక్స్ మినహాయింపును విస్మరిస్తున్నారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) పాన్-ఆధార్ జత చేయకపోవడంతో చాలా సమస్యలు వస్తున్నాయని తెలిపింది. చాలాకాలంగా చెబుతూ వస్తూ డిసెంబరు 31వరకూ దీనిని 8వసారి పొడిగించారు.