400 files Stolen In Court : కోర్టు కబోర్డు నుంచి 400ల ఫైళ్లు మాయం..! చోరీయా? కుట్రా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది?

కోర్టులో ఫైళ్లు మాయం అయ్యాయి. కబోర్డు తాళాలు పగుల కొట్టి 400 ఫైళ్లు మాయం చేశారు. ఇది కేవలం చోరీయా? లేక కుట్రా? అనే విషయం పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

400 files Stolen In Court : కోర్టు కబోర్డు నుంచి 400ల ఫైళ్లు మాయం..! చోరీయా? కుట్రా? పోలీసుల దర్యాప్తులో ఏం తేలనుంది?

400 files stolen from asansol court

400 files stolen In  court : చోరీలు జరిగితే పోలీస్ స్టేషన్ కొచ్చి చెప్పుకుంటారు బాధితులు. పోలీసులు విచారణ చేసి దొంగలను పట్టుకుని కోర్టులో ప్రవేశపెడతారు. కానీ ఏకంగా కోర్టులోనే చోరీ జరిగితే..! కోర్టులో ఏముంటుంది? చోరీ జరగటానికి నేరాలకు సంబందించి ఫైళ్లు..పేపర్లు తప్ప అంటారా? కానీ జరిగిందిగా..కోర్టు ఫైళ్లు మాయం అయ్యాయి. ఒకటీ రెండు కాదు 10 లేక 20 కూడా కాదు.

పశ్చిమ బెంగాల్ లోని అసన్సోల్ సివిల్ కోర్టు నుంచి ఏకంగా 400ల ఫైళ్లు మాయం అయ్యాయి. కోర్టులో తాళం వేసి ఉన్న కబోర్డ్ ను పగుల గొట్టి మరీ 400 ఫైళ్లను ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న​ పోలీసుల దర్యాప్తు చేపట్టారు. నిజంగానే కోర్టులో చోరీ జరిగిందా? లేక దీని వెనుక ఏమైనా కుట్ర ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

ఆదివారం (డిసెంబర్ 4,2022) అర్థరాత్రి దుండగులు డోర్ పగుల గొట్టి ఫైళ్లను చోరీ చేసినట్లుగా భావిస్తున్నారు. దీనిపై కోర్టుకు చెందిన హెడ్ క్లర్క్ అరూప్ దాస్ అసన్సోల్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కోర్టుకు వచ్చి పరిస్థితిని పరిశీలించారు. సెంట్రల్ డీసీ కుల్దీప్, జిల్లా జడ్జి కూడా చోరీ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అక్కడ ఉన్న మిగతా ఫైళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. చోరీ చేసిన కొన్ని ఫైళ్లను అసన్నోల్ చర్చి యార్డ్ లో పాత పేపర్లు అమ్ముతున్న వ్యాపారి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం.

అయితే ఇది కేవలం కాగితాల కోసం దొంగతనం చేశారా?లేదా మరేమైనా కుట్ర ఉందా?అని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. కానీ కాగితాల కోసం చోరీ జరిగితే ఏకంగా కోర్టులోనే చోరీ చేయాల్సిన పని ఏంటీ? అనే అనుమానాలు వస్తున్నాయి. అలాగే చోరీకి గురి అయిన ఫైళ్లకు సంబంధించిన కేసుల నేపథ్యంలో కావాలనే చోరీ జరిగి ఉన్నట్లైతే..ఆ ఫైళ్లను నాశనం చేయకుండా పాతపేపర్లు కొనే వ్యాపారికి ఎందుకు అమ్ముతారు? అనే పలు ప్రశ్నలు వస్తున్నాయి. ఈక్రమంలో ఈకేసును పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.