మహిళా డ్రైవర్లకు గుడ్ న్యూస్.. త్వరలో 5 శాతం పార్కింగ్ కోటా

దేశరాజధాని ఢిల్లీలో నగరవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పార్కింగ్ స్పెస్. నగరవ్యాప్తంగా దాదాపు కోటికిపైగా వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి.

  • Published By: sreehari ,Published On : March 18, 2019 / 02:20 PM IST
మహిళా డ్రైవర్లకు గుడ్ న్యూస్.. త్వరలో 5 శాతం పార్కింగ్ కోటా

దేశరాజధాని ఢిల్లీలో నగరవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పార్కింగ్ స్పెస్. నగరవ్యాప్తంగా దాదాపు కోటికిపైగా వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి.

దేశరాజధాని ఢిల్లీలో నగరవాసులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య పార్కింగ్ స్పేస్. నగరవ్యాప్తంగా దాదాపు కోటికిపైగా వాహనాలు రిజిస్టర్ అయి ఉన్నాయి. ఢిల్లీలో వాహనాలను పార్కింగ్ చేసేందుకు సరైన స్థలాన్ని కేటాయించడం కష్టతరంగా మారింది. ఇప్పటికే ఢిల్లీ నగరవాసుల నుంచి తమ వాహనాలను పార్కింగ్ చేసే విషయంలో పలు డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి.

ప్రత్యేకించి మహిళల కోసం పార్కింగ్ స్లాట్ లను రిజర్వ్ చేయాలని కార్పొరేషన్లు డిమాండ్ చేస్తున్నాయి. మహిళలతో పాటు దివ్యాంగుల కోసం పార్కింగ్ స్లాట్ లను రిజర్వ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఢిల్లీలో కాల్యుష సమస్యను నివారించేందుకు ప్రభుత్వం సరి-బేసి ఫార్మూలాను కూడా ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. 
Read Also : వాట్సాప్‌లో కొత్త ఫీచర్ : ఫేక్ న్యూస్‌ను పట్టేస్తుంది

మరోవైపు ఢిల్లీ-ఎన్ సీఆర్ వ్యాప్తంగా పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఈ క్రమంలో మహిళలు, దివ్యాంగులకు ప్రత్యేకంగా పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేసేలా పార్కింగ్ కోటాను తీసుకురావాలని నగర కార్పొరేషన్లు ప్రతిపాదించాయి. ఈ కొత్త ప్రతిపాదనతో నగరంలో 1.9 కోట్ల మొత్తం పార్కింగ్ స్థలాల్లో మహిళా డ్రైవర్ల కోసం 5 శాతం పార్కింగ్ కోటాను రిజర్వ్ చేయనున్నారు.

దివ్యాంగుల కోసం 3 శాతం పార్కింగ్ స్థలాలను రిజర్వ్ చేయాలని యోచిస్తున్నారు. మహిళల పార్కింగ్ రిజర్వేషన్ విషయంలో కమిటీకి డజన్లకు పైగా ప్రతిపాదనలు రావడంతో దీనిపై పరిశీలన జరుగుతోంది. ఢిల్లీలోని హైకోర్టు బెంచ్ సిఫార్స్ మేరకు త్వరలో మహిళా డ్రైవర్లకు 5 శాతం, దివ్యాంగులకు 3 శాతం పార్కింగ్ రిజర్వేషన్ తీసుకుచ్చే అవకాశాలు ఉన్నాయి.  

ఉత్తర ఢిల్లీలో మొత్తం 12 కార్పొరేషన్లు ఉండగా.. 251 పార్కింగ్ స్థలాలు ఉన్నాయి. కాంట్రాక్టర్లు, సివిల్ అధికారులు, పోలీసుల మధ్య సమన్వయ లోపం కారణంగా పార్కింగ్ స్పెస్ సమస్య మరింత కఠినంగా మారింది. ఎవరూ వీటిని పట్టించుకోకపోవడంతో పార్కింగ్ స్థలాల్లో అక్రమ కట్టడాలు వెలిశాయి. పార్కింగ్ కోటా విధానంతో అంతా పారదర్శకంగా ఉండేలా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.

కొత్త పార్కింగ్ కేటాయింపు ప్రక్రియపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు కూడా వచ్చాయి. పార్కింగ్ రిజర్వ్ కోటా విధానంతో రానున్న రోజుల్లో ఢిల్లీలో పూర్తి స్థాయిలో పార్కింగ్ సమస్య పరిష్కారం కానప్పటికీ.. మహిళలు, దివ్యాంగులకు పార్కింగ్ కోటా కేటాయించడం నగరంలో మార్పుకు తొలి సంకేతంగా భావిస్తున్నారు.

నార్త్ ఢిల్లీలో పార్కింగ్ కోటా రిజర్వడ్ ప్రపోజల్స్ ఇవే..

* ఒక్కో జోన్ కు 12 జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటు
నగరంలో రిజస్టర్ అయిన వాహనాల సంఖ్య కోటికి పైనే
* 251 పార్కింగ్ స్లాట్స్.. ఎస్ డీఎంసీ – 102, నార్త్ 99, ఈడీఎంసీ 50
* 5 శాతం మహిళలకు, 3 శాతం దివ్యాంగులకు 
* అన్ని పార్కింగ్ స్థలాల్లో యూనిఫామ్ కలర్ కోడ్ (బ్లూ బేస్ వైట్ టెక్స్ట్) 
* పార్కింగ్ సైట్లను మానిటోరింగ్ చేసేందుకు మొబైల్ యాప్స్ వినియోగం
* పార్కింగ్ సైట్లు ఎల్లో థెర్మోప్లాస్టిక్ పేయింట్ మార్క్ 

Read Also : జైలుకెళ్లను బిడ్డో : ఒకేసారి రూ.462 కోట్లు కట్టిన అంబానీ