Tamilnadu: వినాయక మండపం పక్కన చంద్రయాన్-3 రాకెట్ సెట్.. రాకెట్ లాంచ్ అవుతుంటే సెల్పీలతో మురిసిపోతున్న ప్రజలు
శంముగన్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. కొద్ది రోజుల క్రితం చంద్రాయన్-3ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తాజా రాకెట్ రూపొందించారు. ఇకపోతే వినాయకమండపం వద్ద ఏర్పాటు చేసిన చంద్రయాన్-3కి సంబంధించిన వీడియోలు నెట్టిట్లో వైరల్ అవుతున్నాయి.

Chandrayaan3: వినాయక చవితి ఉత్సవాలు అంటే జోష్ అంతా ఇంతా కాదు. ఇక గణేషుడి విగ్రహాలు, మండపాలు చిత్రవిచిత్రంగా ఉంటాయి. డబ్బులతో మండపాలను అలంకరిస్తుంటారు, టీకప్పులతో వినాయకుడిని చేస్తుంటారు, మండపాన్ని సినిమా సెట్ లా తయారు చేస్తుంటారు. ఇలాంటి వింతలు, విశేషాలు బాగానే జరుగుతాయి. ఈ కోణంలోనే తమిళనాడులోని ఒక ప్రాంతంలో చంద్రయాన్-3 సెట్ ఏర్పాటు చేశారు. వినాయకుడి మండపం పక్కనే ఏర్పాటు చేసి రాకెట్ లాంచ్ కూడా చేశారు. దీన్ని చూడడానికి చుట్టు పక్కల ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ప్రజలు అక్కడ ఫొటోలు, వీడియోలు తీసి నెట్టింట్లో షేర్ చేస్తున్నారు.
#WATCH | Chennai, Tamil Nadu: Ahead of Ganesh Chaturthi celebrations, a model of Chandrayaan-3 rocket near Lord Ganesh idol in Keelkattalai is attracting people. A local designer, Shanmugam has designed the rocket in honour of Chandrayaan-3, launched by the ISRO. pic.twitter.com/ruL2yKuK1F
— ANI (@ANI) September 18, 2023
రాష్ట్రంలోని కీల్కట్టలైలో ఏర్పాటు చేశారు. శంముగన్ అనే డిజైనర్ దీన్ని రూపొందించాడు. కొద్ది రోజుల క్రితం చంద్రాయన్-3ని ఇస్రో విజయవంతంగా పూర్తి చేసిన విషయం తెలిసిందే. అయితే దాన్ని స్ఫూర్తిగా తీసుకునే తాజా రాకెట్ రూపొందించారు. ఇకపోతే వినాయకమండపం వద్ద ఏర్పాటు చేసిన చంద్రయాన్-3కి సంబంధించిన వీడియోలు నెట్టిట్లో వైరల్ అవుతున్నాయి.