Living Liquidz : ఆన్ లైన్‌‌లో మోసాలు, జాగ్రత్త అంటున్న షబానా

ముందుగానే డబ్బులు చెల్లించినా..తాను చేసిన ఆర్డర్ ను డెలివరీ చేయలేదని, పోన్ చేస్తుంటే..కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని సీనియర్ నటి షబానా ఆజ్మీ వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

Living Liquidz : ఆన్ లైన్‌‌లో మోసాలు, జాగ్రత్త అంటున్న షబానా

Shabana

Actor Shabana Azmi : ఆన్ లైన్‌‌లో మోసాలు వెలుగు చూస్తూనే ఉన్నాయి. ఇందులో సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు చిక్కుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి షబానా ఆజ్మీ కూడా మోసపోయారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. Living Liquidz కు ఆర్డర్ ఇచ్చినట్లు, ముందుగానే ఆన్ లైన్ లో డబ్బులు చెల్లించడం జరిగిందని..దీనికి సంబంధించిన వివరాలను షబానా ఆజ్మీ పోస్టు చేశారు.

ముందుగానే డబ్బులు చెల్లించినా..తాను చేసిన ఆర్డర్ ను డెలివరీ చేయలేదని, ఫోన్ చేస్తుంటే..కనీసం లిఫ్ట్ కూడా చేయలేదని వెల్లడించారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఈ సీనియర్ నటి. చివరకు living_liquidz యజమానులను ట్రేస్ చేయడం జరిగిందని, తనను మోసం చేసిన వ్యక్తులు living_liquidz తో సంబంధం లేదన్నారు. ఫోన్ నెంబర్ లు ఫ్రాడ్ గా ఉంటాయని, ఈ విషయంలో చాలా జాగ్రత్త వహించాలన్నారు. దీనిపై యాక్షన్ తీసుకోవాలని @mumbaipolice, @cybercrime ట్యాగ్ చేస్తూ కోరారు. దీనిపై నెటిజన్లు స్పందించారు. సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారా ? లేదా ? అంటూ కామెంట్స్ పెడుతున్నారు.