Shraddha Walkar: శ్రద్ధాను చంపినందుకు పశ్చాత్తాపమే లేని ఆఫ్తాబ్.. పలువురితో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో వెల్లడి

శ్రద్ధా వాకర్‌ను చంపినందుకు పశ్చాత్తాపపడటం లేదు ఆఫ్తాబ్ అమీన్‌. పాలిగ్రాఫ్ పరీక్షలో ఈ విషయం వెల్లడైంది. అలాగే శ్రద్ధా వాకర్ తన ప్రేయసిగా ఉన్నప్పటికీ మరికొందరు యువతులతో డేటింగ్ చేసినట్లు ఆఫ్తాబ్ తెలిపాడు.

Shraddha Walkar: శ్రద్ధాను చంపినందుకు పశ్చాత్తాపమే లేని ఆఫ్తాబ్.. పలువురితో డేటింగ్ చేసినట్లు పాలిగ్రాఫ్ టెస్టులో వెల్లడి

Shraddha Walkar: తనతో సహజీవనం చేసిన శ్రద్ధా వాకర్‌ను చంపినందుకు ఆఫ్తాబ్ అమీన్‌లో ఎలాంటి పశ్చాత్తాపమే లేదని పాలిగ్రాఫ్ టెస్టులో వెల్లడైంది. ఇటీవల ఆఫ్తాబ్‌కు అధికారులు పాలిగ్రాఫ్ టెస్టు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరి (ఎఫ్ఎస్ఎల్) ఆధ్వర్యంలో అధికారులు పాలిగ్రాఫ్ టెస్ట్ నిర్వహించారు.

Bengaluru: మద్యం మత్తులో ఉన్న యువతిపై బైక్ ట్యాక్సీ డ్రైవర్ అత్యాచారం.. మరో వ్యక్తితో కలిసి దురాగతం

దీనికి సంబంధించిన వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. పాలిగ్రాఫ్ పరీక్షలో ఆఫ్తాబ్ తన నేరాన్ని అంగీకరించాడు. శ్రద్ధను చంపి, ముక్కలుముక్కలుగా నరికినట్లు, అనంతరం శరీర భాగాల్ని అడవుల్లో పడేసినట్లు ఒప్పుకొన్నాడు. ఈ విషయంలో తనకు ఎలాంటి పశ్చాత్తాపమే లేదన్నాడు. అంతేకాదు.. శ్రద్ధా వాకర్ ఉన్నప్పటికీ పలువురు యువతులతో డేటింగ్ చేసినట్లు చెప్పాడు. పాలిగ్రాఫ్ పరీక్ష సందర్భంగా అతడు చాలా మామూలుగానే ప్రవర్తించాడు. ఈ సందర్భంగా తను ఈ కేసుకు సంబంధించిన వివరాల్ని ఇప్పటికే వెల్లడించానని పోలీసులకు చెప్పాడు. ఈ విచారణ కోసం ఆప్తాబ్‌ను కట్టుదిట్టమైన భద్రత మధ్య ఢిల్లీ ఎఫ్ఎస్ఎల్‌కు తీసుకురావాల్సి వచ్చింది.

మొత్తం 5 సెషన్లుగా ఈ టెస్టు నిర్వహించారు. పాలిగ్రాఫ్ టెస్ట్ పూర్తి కావడంతో అధికారులు నార్కో టెస్టుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. డిసెంబర్ 1, 5 తేదీల్లో నార్కో టెస్ట్ నిర్వహిస్తారు.