Agnipath Scheme : ‘అగ్నిపథ్’ పేరుతో సరికొత్త పథకం..4 ఏళ్ల సర్వీస్ కోసం యువతను సైన్యంలో చేర్చుకునే స్కీమ్

దేశ రక్షణ, సాయుధ బలగాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్‌‌కు సంబంధించి.. రక్షణ శాఖ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాని పేరే.. అగ్నిపథ్. ఈ స్కీమ్ కింద.. నాలుగేళ్ల సర్వీస్ కోసం యువకులను సైన్యంలోకి తీసుకుంటారు.

Agnipath Scheme :  ‘అగ్నిపథ్’ పేరుతో సరికొత్త పథకం..4 ఏళ్ల సర్వీస్ కోసం యువతను సైన్యంలో చేర్చుకునే స్కీమ్

Agnipath Recruitment Scheme

“Agnipath” Recruitment Scheme : దేశ రక్షణ, సాయుధ బలగాలకు సంబంధించి భారత ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్‌లో రిక్రూట్‌మెంట్‌‌కు సంబంధించి.. రక్షణ శాఖ సరికొత్త విధానాన్ని తీసుకొచ్చింది. దాని పేరే.. అగ్నిపథ్. ఈ స్కీమ్ కింద.. నాలుగేళ్ల సర్వీస్ కోసం యువకులను సైన్యంలోకి తీసుకుంటారు. టూర్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్ కింద.. పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకోవడంతో.. జీతాలు, అలవెన్సులు, పెన్షన్ల రూపంలో.. సర్కారుకు వేల కోట్లు ఆదా అవడంతో పాటు భారత సైన్యం మరింత బలపడుతుందని.. కేంద్రం అంచనా వేస్తోంది.

దేశ రక్షణలో కీలకంగా ఉన్న త్రివిధ దళాలు, సాయుధ బలగాల నియామకాలకు సంబంధించి.. కేంద్రం కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. అగ్నిపథ్ పేరుతో.. సరికొత్త సర్వీస్ పథకాన్ని ప్రారంభించింది. నాలుగేళ్ల సర్వీస్‌ కోసం యువకులను సైన్యంలోకి తీసుకునే.. రిక్రూట్‌మెంట్ పాలసీని.. రక్షణంత్రి రాజ్‌నాథ్ సింగ్.. త్రివిధ దళాల అధిపతులతో కలిసి ప్రకటించారు. కరోనా కారణంగా.. రెండేళ్ల నుంచి సైన్యంలో రిక్రూట్‌మెంట్ నిలిచిపోయింది. దీంతో.. ఆ లోటును భర్తీ చేసుకునేందుకు కేంద్రం ఈ విధానాన్ని తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.

అగ్నిపథ్ స్కీమ్ కింద.. పదిహేడున్నరేళ్ల నుంచి 21 ఏళ్ల లోపు ఉండే యువకులను.. సైన్యంలోకి తీసుకుంటారు. వీరిని.. అగ్నివీరులని పిలుస్తారు. ఎంపికైన వారికి ఆరు నెలల పాటు శిక్షణ ఇచ్చి.. మూడున్నరేళ్లు సర్వీసులో కొనసాగిస్తారు. త్రివిధ దళాల్లో వివిధ బాధ్యతలను వీరికి అప్పగిస్తారు. సర్వీస్ పూర్తయ్యాక.. ప్రతి బ్యాచ్‌లో 25 శాతం మందిని రెగ్యులర్ సర్వీస్ కోసం తీసుకుంటారు. త్రివిధ దళాల అధిపతులు కొద్ది రోజుల కిందటే.. ప్రధాని మోదీకి అగ్నిపథ్ పథకం గురించి వివరించారు. దీనిని సైనిక వ్యవహారాల శాఖ ప్లాన్ చేసి.. అమలు చేస్తోంది. దీనికి.. కేంద్ర కేబినెట్ ఆమోదం కూడా తెలిపింది.

టెన్త్, ఇంటర్ పాస్ అయినవారు ఈ స్కీమ్‌ కింద సైనిక దళాల్లో చేరొచ్చు. మొదటి ఏడాది 4 లక్షల 76 వేల ప్యాకేజీతో వేతనం చెల్లిస్తారు. నాలుగేళ్ల సర్వీస్ ముగిసే నాటికి.. 6 లక్షల 97 వేల వరకు పెంచుతారు. సర్వీస్ కాలంలో.. జీతం నుంచి 30 శాతాన్ని సేవానిధి ప్యాకేజీ కింద తీసుకుంటారు. దీనికి సమానంగా.. కేంద్రం తన వంతు జమ చేస్తుంది. నాలుగేళ్ల సర్వీస్ పూర్తయ్యాక.. ఎలాంటి పన్నులు లేకుండా ఒకేసారి 11 లక్షల 71 వేల రూపాయలను అందిస్తారు. అంతేకాదు.. బ్యాంకు నుంచి పదహారున్నర లక్ష లోన్ సదుపాయంతో పాటు సర్వీసులో 48 లక్షల వరకు ఇన్సూరెన్స్ కూడా ఉంటుంది. అగ్నివీరులకు.. పెన్షన్ సదుపాయం ఉండదు. అయితే.. సర్వీస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. ఉపాధి మార్గాల కోసం సాయుధ దళాల నుంచి సహాయం పొందుతారు. అగ్నిపథ్ పథకం ద్వారా షార్ట్ టర్మ్ సర్వీసులో చేరిన యువతకు.. సైనికులతో సమానంగా ర్యాంకులు కేటాయిస్తారు. సర్వీసులో ఎంపికైన వారికి.. అగ్నివీర్ స్కిల్ సర్టిఫికెట్ అందజేస్తారు.

అగ్నిపథ్ స్కీమ్ కింద సైన్యంలో.. భారీగా యువకులు చేరే అవకాశం ఉంటుంది. 90 రోజుల్లో అగ్నిపథ్‌కు సంబంధించిన.. తొలి ర్యాలీ మొదలుకానుంది. మొదటి బ్యాచ్‌లో.. 45 వేల మందిని నియమించుకోనున్నారు. దీని ద్వారా యువకులు సైన్యంలో చేరి.. దేశానికి సేవ చేస్తారు. రక్షణ దళాల ఖర్చు, ఏజ్ ప్రొఫైల్‌ తగ్గించడానికి.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఇదీ ఒకటి. నాలుగేళ్ల సర్వీస్‌తో దాదాపు 80 శాతం మంది సైనికులకు విధుల నుంచి ఉపశమనం లభిస్తుంది. రిక్రూట్ చేసుకున్న యువతలో అత్యుత్తమ పనితీరు ఉన్నవారిని సేవలో కొనసాగించే అవకాశం ఉంది.

టూర్ ఆఫ్ డ్యూటీ కాన్సెప్ట్ కింద పెద్ద సంఖ్యలో రిక్రూట్ చేసుకుంటే.. వేతనం, అలెవెన్సులు, పెన్షన్‌ల రూపంలో.. వేల కోట్లు ఆదా అవుతుందని కేంద్రం ప్రాథమికంగా అంచనా వేసింది. ప్రపంచంలో 8 దేశాలలో ఇలాంటి రిక్రూట్ మోడల్‌ను రక్షణ శాఖ అధికారులు అధ్యయనం చేశారు. ఈ విధానం వల్ల.. సైన్యానికి అదనపు లాభాలు కూడా ఉన్నాయి. క్లిష్ట పరిస్థితులు తలెత్తినప్పుడు.. సైన్యానికి అవసరమైనప్పుడు.. అగ్ని వీరులను వినియోగించుకోవచ్చు. వాళ్లు.. అప్పటికే ఆర్మీ ట్రైనింగ్‌లో ఆరితేరి ఉండటం వల్ల.. అత్యవసర పరిస్థితుల్లో సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉంటారు. పైగా.. నాలుగేళ్ల సర్వీస్ తర్వాత.. వీరికి బయట కూడా ఉపాధి అవకాశాలు బాగానే ఉంటాయి. ఆర్మీలో చేయడం వల్ల వచ్చే క్రమశిక్షణే.. వారికి వరమవుతుంది. అనేక సంస్థలు.. దేశానికి సేవ చేసిన, శిక్షణ పొందిన, క్రమశిక్షణ కలిగిన యువతకు ఉద్యోగాలను రిజర్వ్ చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ఇలా అటు సైన్యానికి.. ఇటు యువతకూ ఎంతో ఉపయోపడనుంది ఈ అగ్నిపథ్‌ స్కీమ్..

‘అగ్నివీర్’ అవ్వండి ఇలా..
ఆల్ ఇండియా మెరిట్ ఆధారంగా సెలక్షన్ విధానం..
నిబంధనలకు అనుగుణంగా ఫిట్ నెస్..
10tn లేదా ఇంటర్ పాస్ అయిన వారు అర్హులు..
నాలుగేళ్లపాటు సర్వీస్..ఏడాది 4 లక్షల 76 వేల జీతం..
నాలుగో సంవత్సరం ఏడాదికి రూ.6 లక్షల 92,000 జీతం..
అగ్నివీర్ సర్వీస్ పూర్తి అయిన తరువాత రెగ్యులర్ క్యాటర్ కు దరఖాస్తు చేసుకునే అవకాశం..
మెరిట్,ఆర్మీ అవసరాలకు తగ్గినట్లుగా ఎంపిక..
విధి నిర్వాహణలు అమరులు అయితే రూ.కోటి ఇన్సూరెన్స్..
విధి నిర్వాహణలో వికలాంగులుగా మారితే పూర్తి జీతం..