భారీ కుట్ర భగ్నం, 09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

  • Published By: madhu ,Published On : September 19, 2020 / 09:46 AM IST
భారీ కుట్ర భగ్నం, 09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదుల అరెస్టు

NIA raids  : దేశంలో భారీ ఉగ్రకుట్రను NIA (National Investigation Agency) భగ్నం చేసింది. కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు..09 మంది ఆల్ ఖైదా ఉగ్రవాదులను పట్టుకోవడం కలకలం రేపింది. ఢిల్లీలో భారీ విధ్వంసానికి కుట్ర పన్నారని తేలింది.



గత కొద్ది రోజులుగా సరిహద్దుల వద్ద కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు పొడుస్తుంటే..మరోవైపు దేశంలో అంతర్గత భద్రత కోణంలో అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని తాజా ఘటన చూపిస్తోంది. విశాఖ, బెంగళూరు, యూపీలో టెర్రరిస్టులను అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. పలు ప్రాంతాలపై నిఘా పెట్టారు ఏన్ఐఏ అధికారులు.

కేరళ రాష్ట్రంలోని ఎర్నాకులం, వెస్ట్ బెంగాల్ లో ముషీరాబాద్ లో ఉగ్రవాదులున్నట్లు నిర్ధారించారు. అక్కడ దాడులు చేసి 09 మంది ఉగ్రవాదులను పట్టుకున్నారు. దేశ అంతర్గత భద్రతకు విఘాతం కలిగించే విధంగా సోషల్ మీడియాలో వీరు పోస్టులు పెడుతున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది.



భారీగా మారణాయుధాలు కొనుగోలు చేసేందుకు ఫండ్స్ వసూలు చేస్తున్నారని తేలింది. ఇంకా ఎంత మంది ఉన్నారనే దానిపై ఆరా తీస్తోంది. వీరి నుంచి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తానికి ఎన్ఐఏ సోదాలతో పెద్ద ప్రమాదం తప్పినట్లైంది.