SBI Services : నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

మీరు ఎస్బీఐ కస్టమరా? నెట్ బ్యాంకింగ్ తో పనుందా? ముఖ్యమైన లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే మీకో అలర్ట్.

SBI Services : నెట్ బ్యాంకింగ్ సేవలు బంద్.. ఎస్బీఐ కస్టమర్లకు అలర్ట్

Sbi Banking Services

SBI Services : మీరు ఎస్బీఐ కస్టమరా? నెట్ బ్యాంకింగ్ తో పనుందా? ముఖ్యమైన లావాదేవీలు చేయాల్సి ఉందా? అయితే మీకో అలర్ట్. మెయింటెనెన్స్ వర్క్‌లో భాగంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను నిలిపివేస్తున్నట్టు ఎస్బీఐ ప్రకటించింది. డిసెంబర్ 11, 12 తేదీల్లో 5 గంటల పాటు ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగనున్నట్లు ఎస్బీఐ తెలిపింది.

Cyber Fraud : గూగుల్‌‌లో సెర్చ్ చేసి రూ. 19 వేలు పొగొట్టుకొన్న యువతి

11 డిసెంబర్ 2021న 23:30 గంటల నుంచి 12 డిసెంబర్ 04:30 గంటల (300 నిమిషాలు) మధ్య కాలంలో చేపట్టే మెయింటెనెన్స్‌ కారణంగా ఆన్‌లైన్ నెట్ బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలుగుతుందని వివరించింది. కస్టమర్లకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్టు ఎస్బీఐ ట్వీట్ చేసింది. మెరుగైన బ్యాంకింగ్ సర్వీసులను అందించేందుకు తమకు సహకరించగలరని అభ్యర్థించింది.

”కస్టమర్లకు మెరుగైన బ్యాంకింగ్ సౌకర్యాలను అందించేందుకు కృషి చేస్తున్నాం. డిసెంబర్ 11, 2021న మధ్య రాత్రి 23:30 గంటల నుంచి డిసెంబర్ 12 ఉదయం 04.30 వరకు అంటే 300 నిమిషాల పాటు టెక్నాలజీ అప్‌గ్రేడ్ చేపడుతున్నాం. ఈ సమయంలో Internet Banking / YONO / YONO Lite / UPI సర్వీసులేవీ పని చేయవు. యూజర్లకు కలిగిస్తున్న ఈ అంతరాయానికి చింతిస్తున్నాం, మాకు సహకరించగలరు’’ అని ఎస్‌బీఐ ట్వీట్‌లో అభ్యర్థించింది. కాగా, నియంత్రణపరమైన నిబంధనలు పాటించనందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐకి ఏకంగా రూ.కోటి పెనాల్టీ వేసింది.

Covid Vaccination : కోవిడ్ టీకా ఏ సమయంలో వేయించుకోవాలో తెలుసా? పరిశోధకులు ఏం చెబుతున్నారంటే..

దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐకి కోట్లాది మంది కస్టమర్లు ఉన్నారు. దేశంలోనే అతిపెద్ద నెట్‌వర్క్ కలిగిన ఎస్బీఐకి 22 వేలకు పైగా బ్రాంచ్ లు ఉన్నాయి. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు ఎప్పటికప్పుడు టెక్నాలజీని అప్ గ్రేడ్ చేస్తుంది. కాగా, తాత్కాలికంగా ఇంటర్నెట్ బ్యాంకింగ్ సేవలను ఎస్బీఐ బంద్ చేయడం ఇదే తొలిసారి కాదు. అక్టోబర్ 8, 2021న కూడా మెయింటనెన్స్ చేపట్టింది. యూజర్లకు మరింత సురక్షితమైన సేవలను అందించేందుకు ఎస్బీఐ కొంతకాలంగా మెయింటనెన్స్ వర్క్ చేపడుతూ ఉంది.