Amarnath Yatra : జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం..

2022 ఏడాదికి గాను ప్రభుత్వం అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారు చేసింది. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 11 వరకు 43 రోజుల పాటు కొనసాగినుంది.

Amarnath Yatra : జూన్ 30 నుంచి అమర్ నాథ్ యాత్ర ప్రారంభం..

Amarnath Yatra  2022

Amarnath Yatra  2022 : పరమ పవిత్ర పుణ్యక్షేత్రాల్లో ఒకటి అమర్ నాథ్. ప్రతి ఏటా మంచు లింగంగా ఏర్పడే మహాశివుడిని దర్శించుకుంటుంటారు భక్తులు. వేసవిలో తప్ప మిగతా అంతా మంచుతో కప్పబడి ఉంటాయి అమర్ నాథ్ యాత్రాస్థలం ప్రాంతాలు.. ఇక్కడి గుహలో మంచుతో ఏర్పడే లింగాకృతిని భక్తులు శివుడి ప్రతిరూపంగా భావిస్తారు. ప్రతి ఏటా అమర్ నాథ్ కు కొన్ని వేల మంది భక్తులు తరలి వచ్చి ఈ మంచు లింగాన్ని దర్శించుకుంటారు. తమ జన్మ చరితార్థం అయ్యిందని తన్మయత్వం చెందుతారు.

ఈ క్రమంలో 2022 ఏడాదికి గాను ప్రభుత్వం అమర్ నాథ్ యాత్ర తేదీలు ఖరారు చేసింది. జూన్ 30న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్ర ఆగస్టు 11 వరకు 43 రోజుల పాటు కొనసాగినుంది. జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధ్యక్షతన నేడు అమర్ నాథ్ ఆలయ బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో యాత్ర తేదీలను నిర్ణయించారు. అయితే, కరోనా వ్యాప్తి ఇంకా ముగియనుందని, అన్ని మార్గదర్శకాలు పాటిస్తూ యాత్ర నిర్వహించాలని తీర్మానించారు.

అమర్ నాథ్ యాత్ర ప్రత్యేకత..
శ్రీనగర్ నుంచి 145 కి. మీ ల దూరంలో ఉన్న అమర్ నాథ్, భారతదేశంలో ప్రధాన తీర్థ యాత్రా ప్రదేశాలలో ఒకటి గా పరిగణించబడుతుంది.సముద్ర మట్టానికి 4175 మీటర్లో ఎత్తులో ఉన్న ఈ ప్రదేశం శివ భక్తులలో బాగా ప్రాచుర్యం పొందింది.మంచుతో సహజంగా ఏర్పడిన దైవ రూపమైన “శివ లింగం” సాక్షాత్తు ఆ పరమ శివుడే. ఈ తీర్థానికి పేరు రెండు హిందీ పదాల కలయిక వల్ల వచ్చింది. అమర్ అనగా అమరమైన.నాథ్ అనగా దేవుడు. హిందూ మత పురాణాల ప్రకారం, శివుడి దేవేరి అయిన పార్వతీదేవి తనకు అమరత్వం యొక్క రహస్యాలు బహిర్గతం చేయమని అభ్యర్థించింది. దీంతో శివుడు ఎవరి చెవినా ఆ రహస్యం పడకూడదు అనే ఉద్దేశ్యంతో ఆమెను హిమాలయాల ఏకాంతంలో ఉన్న ఈ గుహలకు తీసుకు వెళ్ళి జీవిత రహస్యాలు వెల్లడించాడు.

హిమాలయాలకు వెళ్ళే దారిలో, పరమశివుడు తన తలపై ఉన్న చంద్రున్నిచందన్వారి వద్ద, తన వృషభం నందిని పహల్గాం వద్ద వదిలి వెళ్ళాడని ప్రతీతి. తరువాత శివుడు, తన కుమారుడైన గజ దేవుడైన గణేశునిమహగుణాస్ పర్వతం పైన..పాముని శేష్ నాగ్ వద్ద విడిచి పెట్టాడు. తరువాత మహా శివుడు, పంచ భూతాలని పంచ్ రత్ని వద్ద వదిలి గుహ లోకి వెళ్ళాడని నమ్మిక. అప్పడు శివుడు, తన మాటలను ఎవరూ వినకుండా ఉండేందుకు గానూ, గుహ లో మంట వెలిగించి అక్కడి సమస్త జీవులను నాశనం చేశాడని నమ్ముతారు. అయితే అతను గమనించకుండా పోయిన జింక చర్మం కింద ఉన్న రెండు పావురం గుడ్లకి మాత్రం ఎటు వంటి హాని జరగలేదు. ఆ రెండు గుడ్లు, శివుడు రహస్యాన్ని వివరిస్తూ ఉండగా,నిశ్శబ్దంగా పొదిగి,మాటలను దొంగ చాటుగా వినేసాయి. అమర్ నాథ్ గుహ చేరుకోగానే, యాత్రికులు పావురాల జంటను చూడవచ్చు.

భక్తుల విశ్వాశాల ప్రకారం..శివుని రహస్యం చాటుగా విన్న ఆ రెండు పావురాలు, మరల మరల జన్మిస్తూ ఉన్నాయి. అందుచేతనే అవి అమర్ నాథ్ గుహను తమ నిత్య నివాసం గా చేసుకున్నాయి. 6వ శతాబ్దానికి చెందిన సంస్కృత రచన, నీలమాత పురాణం లో ఈ ప్రసిద్ధ యాత్రా స్థలాన్ని పేర్కొన్నారు.