Amazon ద్వారా మద్యం హోం డెలివరీ

  • Published By: Subhan ,Published On : June 20, 2020 / 10:06 AM IST
Amazon ద్వారా మద్యం హోం డెలివరీ

అమెజాన్.కామ్ ఇండియాలో లిక్కర్ హోం డెలివరీకి క్లియరెన్స్ దక్కించుకుంది. అమెరికా ఈ-కామర్స్ దిగ్గజం తొలిసారిగా అవకాశం ఒడిసిపట్టుకుంది. పశ్చిమ బెంగాల్ రాష్ట్ర బేవరేజెస్ కార్పొరేషన్ శుక్రవారం.. ఆథరైజ్‌డ్ ఏజెన్సీ నుంచి ఆన్‌లైన్ రిటైల్ వ్యాపారాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనుంది. కంపెనీలు అన్నింటిలో ఎలిజిబిలిటీ ఉంది ఒక్క అమెజాన్ కు మాత్రమే. 

ఇండియన్ అలీబాబా గ్రోసరీ వెంచర్ అయిన బిగ్ బాస్కెట్ కూడా ఆల్కహాల్ డెలివరీ చేసే అప్రూవల్ దక్కించుకుంది. ఇండియాలోనే అధిక జనాభా కలిగిన రాష్ట్రాల్లో పశ్చిమబెంగాల్ నాలుగోస్థానంలో ఉంది. IWSR Drinks Market విశ్లేషణ ప్రకారం.. అమెజాన్ వెస్ట్ బెంగాల్‌లో 27.2 బిలియన్ డాలర్ల వ్యాపారం చేయగలదని అంచనా వేస్తున్నారు. 

కొన్ని సంవత్సరాలుగా అమెజాన్ ఇండియాలో ఈ కామర్స్ ఆపరేషన్స్ విస్తృతం చేస్తుంది. గ్రోసరీస్, ఎలక్ట్రానిక్స్ వంటివి ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తున్నారు. కంపెనీ ఇండియాలో 6.5బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని కమిట్ అయింది కూడా. గత నెలలో ఇండియాలో టాప్ ఫుడ్ స్టార్టప్స్ అయిన స్విగ్గీ, జొమాటోలు కూడా గత నెలలో ఆల్కహాల్ హోం డెలివరీ చేశాయి. 

లాక్ డౌన్ ప్రకటించడంతో మార్చి నెల నుంచి లిక్కర్ అమ్మకాలను ఇండియా ఆపేసింది. ఆ సమయంలో హోం డెలివరీ చేస్తే కరోనా వ్యాప్తిని అడ్డుకోవచ్చని భావించారు. ప్రతి రాష్ట్రంలో సొంత లిక్కర్ పాలసీలు ఉన్నట్లుగానే పశ్చిమ బెంగాల్ కూడా.. ఎలక్ట్రానిక్ ఆర్డరింగ్ తో అమ్మకాలు, కొనుగోళ్లు జరిపి ఆల్కహాలిక్ లిక్కర్స్ ను లైసెన్స్‌డ్ రిటైల్ అవుట్ లెట్స్ నుంచి అర్హత కలిగిన వారికి డెలివరీ చేసేందుకు రెడీ అవుతుంది.