చిరుత వేగం …శ్రీనివాస్ రికార్డ్ కూడా బద్దలు కొట్టేశాడు

  • Published By: venkaiahnaidu ,Published On : February 18, 2020 / 12:50 PM IST
చిరుత వేగం …శ్రీనివాస్ రికార్డ్ కూడా బద్దలు కొట్టేశాడు

100మీటర్లను,అది కూడా బురద నీటిలో కేవలం 9.55సెకన్లలోనే పరుగెత్తి ప్రపంచ రేస్ దిగ్గజం,జమైకా చిరుతపులి ఉసేన్ బోల్ట్ రికార్డును కర్ణాటకకు చెందిన ఇటీవల బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని సంప్రదాయ క్రీడ కంబాలా రేస్(దున్నపోతుల పరుగు)లో పాల్గొని శ్రీనివాస్ గౌడ ఈ ఘనత సాధించారు. శ్రీనివాస్ గౌడకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెలత్తువెత్తాయి.

కర్ణాటక సీఎం శ్రీనివాస్ ను సత్కరించి,ప్రభుత్వం తరపున అతనికి 3లక్షల రూపాయలు కూడా అవార్డ్ గా ఇచ్చారు. కేంద్రక్రీడాశాఖ మంత్రి కూడా ఒలింపిక్స్ పాల్గొనేలా ట్రైయినింగ్ ఇస్తామని,ముందుగా ట్రయల్స్ కి రావాలని ఆహ్వానించారు. అయితే ఆ ఆహ్వానాన్ని శ్రీనివాస్ సున్నితంగా తిరస్కరించాడు. కంబాలా రేస్ వేరు ఒలంపిక్స్ వేరు అని,తాను కంబాలా రేస్ లలో మాత్రమే పాల్గొంటానని సృష్టం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు కర్ణాటకకు చెందిన మరో కంబాలా రన్నర్ ఇప్పుడు శ్రీనివాస్ రికార్డును కూడా బద్దలు కొట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు. ఆదివారం(ఫిబ్రవరి-16,2020)బజగోలి జోగిబెట్టు అనే ఊరుకి చెందిన నిశాంత్ శెట్టి ఆదివారం(ఫిబ్రవరి-16,2020) వీనూర్ లో జరిగిన సూర్య-చంద్ర జోడుకరె కంబాలా రేస్ లో పాల్గొన్నాడు. 143మీటర్లను 13.68సెకన్లలో పరుగుత్తాడు నిశాంత్.

	kambala2.jpg

అయితే 100మీటర్లను కేవలం9.51సెకన్లోనే పరుగుత్తి వరల్డ్ రికార్డు సృష్టించాడు. శ్రీనివాస్ కన్నా 4సెకన్ల తక్కవ సమయంలో 100మీటర్లు పరుగెత్తిన నిశాంత్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెలబ్రిటీగా మారిపోయాడు. అయితే వరల్డ్ రేస్ దిగ్గజం ఉసేన్ బోల్ట్ కి 100మీటర్లు కవర్ చేయడానకి 9.58సెకన్లు పట్టిన విషయం తెలిసిందే. నిశాంత్ కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. శ్రీనివాస్ గౌడకు ఇచ్చిన ఆఫర్ లాగా కేంద్రక్రీడాశాఖ మంత్రి నిశాంత్ కు కూడా ఛాన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

జంతు హక్కుల కార్యకర్తల ఒత్తిడితో కొన్నేళ్ల క్రితం కర్నాటకలో కంబాలా పోటీలపై నిషేధం కొనసాగింది. అయితే సిద్దరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు ప్రత్యేక చట్టం చేసి కంబాలా పోటీలకు అనుమతిచ్చారు.

Read More>>తండ్రికి తగ్గ తనయుడు : 2నెలల్లో మళ్లీ డబుల్ సెంచరీ బాదిన జూ. రాహుల్ ద్రవిడ్