Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!

కేరళలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వ్యాధులు ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా ఆంత్రాక్స్ వ్యాధి విజృంభిస్తోంది.

Anthrax : కేరళలో ఆంత్రాక్స్ కలకలం.. అడవి పందుల్లో వ్యాప్తి.. లక్షణాలు ఇవే!

Anthrax Detected In Wild Boars In Kerala's Athirapally (1)

Anthrax : కేరళలో ఆంత్రాక్స్ వ్యాధి కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో నిఫా, స్వైన్ ఫ్లూ, కరోనా, మంకీ ఫీవర్ వ్యాధులు ఆందోళన కలిగిస్తుండగా.. కొత్తగా ఆంత్రాక్స్ వ్యాధి విజృంభిస్తోంది. ఆంత్రాక్స్‌ అనేది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధి. ఈ వ్యాధి కారణంగా అత్తిరప్పల్లి అటవీ ప్రాంతంలో అడవి పందులు చనిపోతున్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో ఇటీవల ఐదు నుంచి ఆరు వరకు అడవి పందులు మృతి చెందాయి. వాటి మృతదేహాలను పరిశీలించగా ఆంత్రాక్స్ వ్యాధి కారణంగానే చనిపోయినట్లు నిర్ధారించారు.

ఈ ఘటనపై రాష్ట్ర ఆరోగ్య అధికారులు అప్రమత్తమయ్యారు. ఈ వ్యాధి పశువులు లేదా మనుషులకు వ్యాప్తిచెందకుండా ఉండేందుకు నివారణ చర్యలు చేపట్టారు. ఆంత్రాక్స్‌ అనేది బాసిల్లస్‌ ఆంత్రాసిస్‌ అనే బ్యాక్టీరియా నుంచి సంక్రమించే వ్యాధి. పశువులు, మేకలు, గొర్రెలతోపాటు అడవి జంతువుల్లో ఈ వ్యాధి ఎక్కువగా విజృంభిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన జంతువుల మాంసం తింటే మనుషులకూ ఇది సోకే ప్రమాదం ఎక్కువగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు సాధారణంగా మూడురోజుల్లోనే బయటపడతాయని నిపుణలు అంటున్నారు. ఎక్కువగా బాధితుల్లో జ్వరం, రక్తపు విరేచనాలు, శ్వాసకోస ఇబ్బంది, చర్మంపై పుండ్లు, జలుబు, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్య చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రాణపాయమని హెచ్చరిస్తున్నారు. అత్తిరప్పల్లి అటవీప్రాంతంలో ఆంత్రాక్స్ కారణంగా పందులు చనిపోవడంపై ఆందోళన అవసరం లేదని ఆరోగ్య శాఖ సీనియర్ అధికారి పేర్కొన్నారు.

Read Also : Anthrax in Animals: దేశంలో మరోసారి ఆంత్రాక్స్‌ కలకలం: ఐఐటీ-మద్రాస్‌ క్యాంపస్‌లో ఆంత్రాక్స్‌తో జింక మృతి