Chhatisgarh CM : యూపీ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..యోగి ఓ పిరికివాడు

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో  యోగి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదని చత్తీస్‌ఘ‌ఢ్ సీఎం భూపేష్ భాఘేల్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్

Chhatisgarh CM : యూపీ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత..యోగి ఓ పిరికివాడు

Bupesh

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఉత్తరప్రదేశ్ లో  యోగి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వచ్చే ప్రశక్తే లేదని చత్తీస్‌ఘ‌ఢ్ సీఎం భూపేష్ భాఘేల్ అన్నారు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ ప్ర‌భుత్వం ప‌ట్ల ప్రజ‌ల్లో తీవ్ర వ్యతిరేక‌త ఉంద‌న్నారు. రైతులు, యువ‌త, ద‌ళితులు, వ్యాపారులు స‌హా అన్ని వ‌ర్గాల వారూ యోగి ప‌నితీరుపై నిరాశ‌తో ఉన్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇటీవల తన పర్యటన గురించి సోమవారం మీడియాతో మాట్లాడిన చత్తీస్‌ఘ‌ఢ్ సీఎం..యోగి స‌ర్కార్ అధికారం నిల‌బెట్టుకోలేని ప‌రిస్థితిలో ఉంద‌న్నారు. ఇక,దేశంలో బొగ్గు కొర‌త‌తో విద్యుత్ ప్లాంట్లు మూత‌ప‌డి విద్యుత్ సంక్షోభం త‌లెత్తితే కేంద్రప్ర‌భుత్వం దాట‌వేత ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. బొగ్గు దిగుమ‌తులు కూడా నిలిచిపోవ‌డంతో విద్యుత్ స‌ర‌ఫ‌రాల‌పై పెను ప్ర‌భావం ప‌డ‌నుద‌ని భూపేష్ భాఘేల్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు.

ఇక,ఆదివారం వార‌ణాసిలో జ‌రిగిన కిసాన్ న్యాయ్ ర్యాలీలో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీతో కలిసి పాల్గొన్నచత్తీస్‌ఘ‌ఢ్ సీఎం భూపేష్ భాఘేల్..యోగి ఆదిత్యానాధ్ నిరంకుశ ధోర‌ణితో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని మండిప‌డ్డారు. లఖింపూర్ ఖేరీ ఘటనలో మృతి చెందిన రైతుల కుటుంబాలకు కలిసేందుకు విపక్ష నేతలు వెళ్లకుండా యోగి ప్రభుత్వం అడ్డుకుంటోందని భూపేష్ భాఘేల్ విమర్శించారు.

భూపేష్ భాఘేల్ మాట్లాడుతూ..సాధువులు దేనికీ భయపడరని అనుకునేవాడినని కానీ యోగి ఆదిత్యనాథ్ పిరికివాడు. లఖింపూర్ ఖేరీని సందర్శించకుండా ప్రియాంకా గాంధీని అడ్డుకున్న యోగి పిరికివాడు. నన్ను లక్నో విమానాశ్రయంలో ఆపారు. ప్రియాంక గాంధీని కలవడానికి నేను అక్కడ ఉన్నానని వారికి చెప్పాను కానీ విమానాశ్రయం నుండి బయటకు వెళ్లడానికి అనుమతించలేదు. కానీ మేము యోగిని ఎన్నడూ ఆపలేదు అని అన్నారు.

ALSO READ  అప్ఘానిస్తాన్ కు అమెరికా సాయం