Anupam Kher : మోదీకి అనుపమ్ ఖేర్ గిఫ్ట్.. దీని విశేషం ఏంటంటే
చిన్న రుద్రాక్ష హారాన్ని తన తల్లి దులారీ ప్రత్యేకంగా ప్రధాన మంత్రి కోసం ఇచ్చారని, పగలు.. రాత్రి అనే తేడా లేకుండా మోదీ దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని పోస్టులో రాసుకొచ్చారు. ఆయన్ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు...

Modi
Anupam Kher Meets Modi : బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా పేరుగాంచిన అనుపమ్ ఖేర్.. ప్రతిభావంతుడైన నటుడిగా తనదైన ముద్ర వేశారు. ఆయన నటించిన చిత్రం ‘ది కాశ్మీర్ ఫైల్స్’ ఎంత సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దీనిపై కొన్ని వివాదాలు కూడా చెలరేగాయి. అనుపమ్ ఖేర్..తాజాగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలవడం విశేషం. అంతేగాకుండా ఆయనకు ఓ రుద్రాక్షమాలను బహుకరించారు. ఈ మేరకు ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా అనుపమ్ ఖేర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రొఫైల్ షేర్ చేసిన ఈ ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ అయ్యాయి.
Read More : The Kashmir Files : ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్ర యూనిట్‌ని అభినందించిన ఉత్తరప్రదేశ్ సీఎం యోగి
చిన్న రుద్రాక్ష హారాన్ని తన తల్లి దులారీ ప్రత్యేకంగా ప్రధాన మంత్రి కోసం ఇచ్చారని, పగలు.. రాత్రి అనే తేడా లేకుండా మోదీ దేశ సేవలో నిమగ్నమై ఉన్నారని పోస్టులో రాసుకొచ్చారు. ఆయన్ను కలవడం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. ఆయన్ను కలవగానే మనస్సు, ఆత్మ రెండూ సంతోషించాయని, దేశ ప్రజల కోసం ఆయన తెగ కృషి చేస్తున్నారని కొనియాడారు. అందులో భాగంగా రక్షించడానికి అమ్మ ఇచ్చిన రుద్రాక్ష జపమాలను ఇచ్చినట్లు, దీనిని స్వీకరించినందుకు సంతోషమన్నారు. ఎప్పటికీ ఆన ఆదరణనను గుర్తించుకుంటానని, ఎల్లప్పుడూ భగవంతుడి కృప ఆయనపై ఉండాలని.. ఆయనకు మరింత శక్తిని ఇవ్వాలని కోరారు.
View this post on Instagram