Rajasthan Polls: బీజేపీ వాళ్లను విమర్శిస్తే జైల్లో పెడతారు.. రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు

ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం గెహ్లాట్ అన్నారు. వారు ఆరోపణలు చేస్తే నవ్వు వస్తుందని, బీజేపీ పెద్ద నేతలు రాజస్థాన్‌కు నిరంతరం వస్తున్నారని, అదంతా ఎన్నికల కోసమేనని అన్నారు

Rajasthan Polls: బీజేపీ వాళ్లను విమర్శిస్తే జైల్లో పెడతారు.. రాజస్థాన్ సీఎం వ్యాఖ్యలు

Ashok Gehlot: భారతీయ జనతా పార్టీ నేతలను విమర్శిస్తే జైల్లో వేస్తారని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ విమర్శలు గుప్పించారు. వాస్తవానికి విమర్శల్ని తాను స్వీకరిస్తానని, అయితే బీజేపీ నేతల్ని విమర్శించడంలో తప్పేమీ లేదని అన్నారు. రాష్ట్రంలోని ఫలోడి జిల్లాల్లో జరుగుతున్న రూరల్ ఒలింపిక్స్ సందర్భంగా ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలోఆయన మాట్లాడుతూ బీజేపీ మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. తొందరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల జరగనున్న నేపథ్యంలో ఆయన మాటలకు మరింత పదును పెంచారు.

Telangana Rains : భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణలో రానున్న 5 రోజులు వానలు

ఒకే దేశం, ఒకే ఎన్నికలు అంటూ కేంద్ర ప్రభుత్వంపై గెహ్లాట్ మండిపడ్డారు. దీనిపై ప్రధాని మోదీని, కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. కమిటీ ఏర్పాటు చేయకముందే ప్రతిపక్షాన్ని వెంట తీసుకెళ్లాల్సి ఉండాల్సిందని, ఇంతకు ముందే ఎన్నికల సంఘం, లా కమిషన్ ఈ విషయంలో పలు సిఫార్సులు చేశాయని గుర్తు చేశారు.

సీఎం అశోక్ గెహ్లాట్ ప్రసంగంలోని 5 ప్రధాన అంశాలు..
1. ఒకే దేశం.. ఒకే ఎన్నిక విధానంపై పలు అనుమానాలు ఉన్నాయని సీఎం గెహ్లాట్ అన్నారు. ప్రజాస్వామ్యంలో వారు ఇలాగే పని చేస్తే, తాను ఈ విధానాన్ని అనుమానిస్తాని చెప్పారు. దేశం ఏ దిశలో వెళ్తుందో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారని అన్నారు.

2. తన విమర్శల్లో నిజం ఉంటే సంతోషిస్తానని సీఎం అన్నారు. తాను ప్రజాస్వామ్యాన్ని నమ్ముతానని, ఎవరైనా నన్ను విమర్శిస్తే, అందులో నిజం ఉంది, కాబట్టి తాను దానిని సరిదిద్దుకోవాలని నమ్ముతున్నానని అన్నారు. అయితే బీజేపీ నేతలపై విమర్శలు చేస్తే జైల్లో పెడతారని విమర్శించారు. పెట్రోలు, డీజిల్‌లో ఉన్న ఎక్సైజ్ సొమ్మును భారత ప్రభుత్వం దోచుకుంటోందని, రాష్ట్ర ప్రభుత్వాల పరువు తీస్తున్నారని మండిపడ్డారు.

3. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతలకు ఎలాంటి ఇబ్బంది లేదని సీఎం గెహ్లాట్ అన్నారు. వారు ఆరోపణలు చేస్తే నవ్వు వస్తుందని, బీజేపీ పెద్ద నేతలు రాజస్థాన్‌కు నిరంతరం వస్తున్నారని, అదంతా ఎన్నికల కోసమేనని అన్నారు. అమిత్ షా, నడ్డా కొన్నిసార్లు రాజ్‌నాథ్ వస్తున్నారని అన్నారు. ప్రధాని 6 సార్లు వచ్చారని గుర్తు చేశారు.

4. ఎన్నికల్లో ఆవు పేరుతో ఓట్లు అడిగే బీజేపీ వాళ్లకు సిగ్గుపడాలని సీఎం అన్నారు. ఈ యేడాది బడ్జెట్ లో గోశాలలకు రూ.3 వేల కోట్లు మంజూరు చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ.. బీజేపీ వాళ్లు ఎవరి గురించి మాట్లాడుతున్నారో తెలుసుకుని సిగ్గుపడాలని అన్నారు.

5. కేంద్ర మంత్రి షెకావత్‌ను టార్గెట్ చేస్తూ సంజీవని కుంభకోణంలో ఆయన కుటుంబం మొత్తం నిందితులుగా ఉందని అన్నారు. గజేంద్ర సింగ్ కంపెనీ యజమానులతో కూర్చునేవారని, బాధిత ప్రజలు తన వద్దకు వచ్చినప్పుడు, వారి బాధలు విని తన కళ్లలో నీళ్లు తిరిగాయని అన్నారు. కేంద్ర మంత్రి తనపై కేసు పెట్టారని, తనపై కేసు పెట్టి డబ్బులు తిరిగి ఇస్తే సంతోషిస్తానని గెహ్లాట్ అన్నారు.