Rhino horns: రైనో కొమ్ముల‌ను కాల్చేసిన అస్సాం ప్రభుత్వం.. ఎందుకంటే?

ఒక కొమ్ము గల ఖడ్గమృగానికి ప్రసిద్ధి చెందిన అస్సాంలో ప్రభుత్వం బహిరంగ వేడుకలో 2,500 ఖడ్గమృగం కొమ్ములను కాల్చింది.

Rhino horns: రైనో కొమ్ముల‌ను కాల్చేసిన అస్సాం ప్రభుత్వం.. ఎందుకంటే?

Assam

Rhino horns: నేడు ప్రపంచ ఖడ్గమృగ దినోత్సవం జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో, ఒక కొమ్ము గల ఖడ్గమృగానికి ప్రసిద్ధి చెందిన అస్సాంలో ప్రభుత్వం బహిరంగ వేడుకలో 2,500 ఖడ్గమృగం కొమ్ములను కాల్చింది. ఇది చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కానీ, ఈ అందమైన అడవి జంతువు పరిరక్షణ కోసం పనిచేసే వ్యక్తులు కూడా హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వ చర్యను ప్రశంసిస్తున్నారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

దశాబ్దాలుగా ప్రభుత్వ నిల్వలలో భద్రంగా ఉంచబడిన ఈ ఖడ్గమృగాల కొమ్ములను కాల్చాలని రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. అంతకుముందు అటవీ శాఖ పున: పరిశీలన తర్వాత కొమ్ముల లెక్కింపు పనిని పూర్తి చేశారు. అసోం ప్ర‌భుత్వం మొత్తం 2వేల 479 రైనో కొమ్ముల‌ు ఉన్నట్లు లెక్కించింది. రైనోలను సంరక్షించుకునే సంక‌ల్పంతో వీటిని కాల్చారు.

రైనోల కొమ్ములకు ఔష‌ధ ప్రాముఖ్యం ఉన్న‌ద‌నే ప్రచారం ఉండగా.. ఇందుకోసం వేట‌గాళ్లు అట‌వీ అధికారుల క‌ళ్లుగ‌ప్పి రైనోల‌ను వేటాడుతున్నట్లుగా గుర్తించారు. రైనోల కొమ్ముల కోసం అత్యంత కిరాత‌కంగా చంపి కొమ్ములు ఊడ‌దీసుకుని పోతున్నారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా వచ్చారు. ఇతర రాజకీయ నాయకులను ప్రత్యేక ఆహ్వానం మేరకు ఆహ్వానించారు. ఈ చర్య అస్సాం ప్రభుత్వం మరియు అటవీ శాఖ “ఖడ్గమృగం పరిరక్షణ” ప్రచారంలో మైలురాయిగా నిలిచింది.