Bank Holidays In January 2023 : జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు అంటే..

జనవరి నెలలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్. జనవరి నెలలో ఏయే రోజులు బ్యాంకులు పని చేస్తాయి? ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి.

Bank Holidays In January 2023 : జనవరిలో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు అంటే..

Bank Holidays In January 2023 : జనవరి నెలలో బ్యాంకులో ముఖ్యమైన పనులు ఉన్నాయా? అయితే మీకో అలర్ట్. జనవరి నెలలో ఏయే రోజులు బ్యాంకులు పని చేస్తాయి? ఎన్ని రోజులు బ్యాంకులకు సెలవులు ఉన్నాయో తెలుసుకోవాలి. అందుకు అనుగుణంగా బ్యాంకు పనులను షెడ్యూల్ చేసుకోవాలి. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) 2023 జనవరిలో బ్యాంకు సెలవులకు సంబంధించిన క్యాలెండర్‌ను విడుదల చేసింది. రీజియన్ల వారీగా సెలవుల జాబితాను ఆర్‌బీఐ తన అధికారిక వెబ్‌సైట్‌లో అప్‌డేట్ చేసింది. ఈ క్యాలెండర్ ఆధారంగా మీ పనులను ప్లాన్ చేసుకుంటే మంచిది.

Also Read.. క్రెడిట్ కార్డ్.. నగదు తీసుకోవడం బెటరా? రుణం తీసుకోవడం బెటరా?

2023 జనవరిలో మొత్తం 11 రోజుల పాటు బ్యాంకు సెలవులు ప్రకటించింది ఆర్బీఐ. ఈ 11 సెలవుల్లో ఆదివారాలు, రెండో శనివారం, నాల్గో శనివారంతో పాటు ఆయా రాష్ట్రాల్లో పండగలకు అనుగుణంగా బ్యాంకులు పని చేయనున్నాయి.(Bank Holidays In January 2023)

జనవరిలో బ్యాంకులకు సెలవులు..
* జనవరి 1న ఆదివారం
* జనవరి 8న ఆదివారం
* జనవరి 14న రెండో శనివారం(భోగి)
* జనవరి 15న ఆదివారం(సంక్రాంతి)
* జనవరి 22న ఆదివారం
* జనవరి 26న గణతంత్ర దినోత్సవం
* జనవరి 28న నాల్గో శనివారం
* జనవరి 29న ఆదివారం సెలవు

Also Read..Paytm Transfer Money : పేటీఎం నుంచి మీ సొంత బ్యాంకు అకౌంట్లకు ఎలా నగదు పంపుకోవాలో తెలుసా? ఇదిగో ప్రాసెస్..!

ఈసారి భోగి పండుగ రెండో శనివారం రాగా.. సంక్రాంతి పండుగ ఆదివారం వచ్చింది. దాంతో ఈ పండుగల సందర్భంగా వచ్చే సెలవులు సాధారణ సెలవుల్లో కలిసిపోయాయి.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

2023 జనవరిలో బ్యాంకులు ఎప్పుడు మూసి వేయబడతాయో తెలుసుకోవడం ఖాతారులకు అవసరం. తద్వారా వారు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవచ్చు. జనవరి 2023లో ప్రాంతీయ పండుగలు, జాతీయ కార్యక్రమాలు, రాష్ట్ర-సమాఖ్య ప్రభుత్వ సెలవులు షెడ్యూల్ చేయబడ్డాయి. ఈ రోజుల్లో ఏ బ్యాంకులలోనూ (పబ్లిక్ లేదా ప్రైవేట్) ఆఫ్‌లైన్ ఆర్థిక లావాదేవీలు అనుమతించబడవు. వీటిని దృష్టిలో ఉంచుకుని ఖాతాదారులు తమ బ్యాంకింగ్ కార్యకలాపాలను ప్లాన్ చేసుకోవాలి.