Bihar CM Nitish Kumar : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ వ్యూహం..ప్రతిపక్ష పార్టీలను ఒకేతాటిపైకి!

బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ రివర్స్‌ పంచ్‌కు ఇప్పటికే బాక్సింగ్‌ రింగ్‌లో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న బీజేపీని మరింత కార్నర్‌ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్‌కుమార్‌ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఒకేతాటిపైకి తీసుకొస్తానని నితీశ్‌ అంటున్నారు.

Bihar CM Nitish Kumar : బీజేపీకి వ్యతిరేకంగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ రాజకీయ వ్యూహం..ప్రతిపక్ష పార్టీలను ఒకేతాటిపైకి!

Bihar CM Nitish Kumar : బీహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌ రివర్స్‌ పంచ్‌కు ఇప్పటికే బాక్సింగ్‌ రింగ్‌లో కిందపడి గిలగిలా కొట్టుకుంటున్న బీజేపీని మరింత కార్నర్‌ చేసే ప్రయత్నాలు మొదలయ్యాయి. బీజేపీకి వ్యతిరేకంగా నితీశ్‌కుమార్‌ రాజకీయ వ్యూహాలకు పదును పెడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలను ఒకేతాటిపైకి తీసుకొస్తానని నితీశ్‌ అంటున్నారు. ప్రధాని కావాలన్న ఆలోచన తనకు లేదని నితీశ్‌ మరోసారి కుండబద్దలుకొట్టారు. విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఉంటారా అని పదే పదే ప్రశ్నించిన జర్నలిస్టులకు నితీశ్‌ను తనదైన స్టైల్‌లో సమాధానం చెప్పారు. మళ్లీ ఈ ప్రశ్న అడగొద్దంటూ నితీశ్‌ నమస్కారం పెట్టారు.

రెండు రోజుల క్రితం నితీశ్‌ ప్రమాణస్వీకారం తర్వాత కూడా జర్నలిస్టులు ఇదే ప్రశ్న అడగ్గా.. ఈ క్వశ్చన్‌ అడగాల్సింది తనని కాదు అని.. 2014లో ప్రధానిగా ఎన్నికైన మోదీ… 2024లో అది రిపీట్ చేయగలరా అని ఆయన్ను ప్రశ్నించాలంటూ నితీశ్‌ రివర్స్‌ అటాక్‌ చేశారు. కేంద్రంలో బీజేపీని గద్దె దింపేందుకు ప్రతిపక్షాల ఐక్యత కోసం కృషి చేస్తానని.. అయితే తాను మాత్రం ప్రధాని పదవిని ఆశించడం లేదని క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి తనకైతే విపక్షాల ప్రధాని అభ్యర్థిగా ఉండాలన్న ఆలోచన ప్రస్తుతానికి అయితే లేదని నితీశ్‌ స్పష్టం చేశారు. ఇటీవల బీజేపీతో పొత్తుకు స్వస్తి పలికి, ఆర్‌జేడీతో కలిసి బిహార్‌లో నితీష్ కుమార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.

Bihar Politics : నితీష్ కుమార్ వ్యవహారంతో విపక్షాల్లో పెరుగుతున్న ఆశలు..ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమికి యత్నాలు

నితీశ్ కుమార్ బీజేపీకి దూరం కావడంతో, భవిష్యత్తులో మోదీకి పోటీగా ప్రధాని అయ్యే ఉద్దేశంతోనే ఈ పని చేసినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో ప్రతిపక్షాల తరఫున ఆయన ప్రధాన మంత్రి అభ్యర్థిగా పోటీ చేసే అవకాశాలున్నాయని జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజాగా ఇదే అంశంపై నితీష్ కుమార్‌ను మీడియా ప్రశ్నించింది. దీనికి ఆయన తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని స్పష్టం చేశారు. చేతులు జోడించి చెబుతున్నాను.. తనకు ప్రధాని కావాలన్న ఆలోచన లేదని తేల్చి చెప్పారు.

తాను అందరి కోసం పని చేస్తానని చెప్పారు. ప్రతిపక్షాలు కూడా కలిసి పనిచేసేలా చేయడమే తన ఉద్దేశమని.. అది జరిగితే చాలా మంచిదన్నారు. తనకు వీలైనంతగా పని చేస్తానని.. ఈ విషయంపై అనేక ఫోన్ కాల్స్ వస్తున్నాయని తెలిపారు. ముందుగా తాను బిహార్‌లో పని చేయాలన్నారు. ప్రధాని కావడం తన చేతుల్లో లేదన్నారు. దీని గురించి ఎవరేం చెబుతున్నారో తనకు అనవసరమని చెప్పారు. తన సన్నిహితులు చెబుతున్నదానితో కూడా తనకు సంబంధం లేదని పేర్కొన్నారు.