Bihar Politics : నితీష్ కుమార్ వ్యవహారంతో విపక్షాల్లో పెరుగుతున్న ఆశలు..ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమికి యత్నాలు

బిహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం పద్మవ్యూహానికి చిక్కకుండా.. బీజేపీకి ముందే కటీఫ్‌ చెప్పిన నితీష్ కుమార్ తీరుపై.. విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయ్. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయ్. ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ప్రయత్నాలు మళ్లీ వేగం కానున్నాయ్.

Bihar Politics : నితీష్ కుమార్ వ్యవహారంతో విపక్షాల్లో పెరుగుతున్న ఆశలు..ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమికి యత్నాలు

Bihar Politics

Bihar Politics : బిహార్ పరిణామాలతో రాజకీయం ఆసక్తికరంగా మారింది. కమలం పద్మవ్యూహానికి చిక్కకుండా.. బీజేపీకి ముందే కటీఫ్‌ చెప్పిన నితీష్ కుమార్ తీరుపై.. విపక్షాలు ప్రశంసలు గుప్పిస్తున్నాయ్. దీంతో పాటు తమకు ఓ హోప్ దొరికినట్లు ఫీల్ అవుతున్నాయ్. ఎన్డీఏకు వ్యతిరేకంగా కూటమి కట్టాలన్న ప్రయత్నాలు మళ్లీ వేగం కానున్నాయ్. బిహార్‌ మాత్రమే కాదు.. ఢిల్లీ రాజకీయాలను శాసించాలని నితీష్ ఫిక్స్ అయ్యారా.. నేషనల్ పాలిటిక్స్‌పై బిహార్ ఎపిసోడ్ ఎలాంటి ప్రభావం చూపించబోతోంది..

రాజకీయాల్లో అవసరాలు మాత్రమే ఉంటాయ్. అనుబంధాలు ఉండవ్.. బిహార్ ఎపిసోడ్‌తో మరోసారి ప్రూవ్ అయింది అదే ! రాజకీయం ఎప్పుడూ యుద్ధంలానే ఉంటుంది.. ప్రతీ సీన్ క్లైమాక్స్‌లానే కనిపిస్తుంది. ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో.. ఏ మలుపు ఏ పరిణామానికి దారి తీస్తుందో ఈజీగా చెప్పలేం! బిహార్‌లో నితీష్ ఇచ్చిన ట్విస్ట్.. ఢిల్లీ లెవల్‌లో రీసౌండ్ ఇచ్చేలా కనిపిస్తోంది. దేశ రాజకీయాలను భారీగా మలుపు తిప్పేలా పరిణామాలు తయారవుతున్నాయ్. బిజేపీకి హ్యాండ్ ఇచ్చారు.. ఆర్జేడీతో హ్యాండ్‌ కలిపారు.. ఇక్కడివరకు అంతా బాగానే ఉంది.. ఐతే ఆ తర్వాత నితీష్ చేసిన కామెంట్స్. ఇప్పుడు మరింత ఆసక్తికరంగా మారాయ్. 2014లో గెలిచిన వాళ్లు.. 2024లో గెలుస్తారా అంటూ నితీష్ సంధించిన ప్రశ్న.. సవాల్‌లా వినిపిస్తోంది. విపక్షాలన్నీ కూటమి కట్టాలని అనుకుంటున్న వేళ.. ఈ కామెంట్స్ హాట్‌టాపిక్ అవుతున్నాయ్.

నిజానికి బిహార్‌లో జేడీయూను టార్గెట్ చేయాలని బీజేపీ ఫిక్స్ అయింది. అందుకోసం ఆర్సీపీ సింగ్‌ను తెరమీదకు తీసుకువచ్చింది. మహారాష్ట్రలా షిండేలా.. బిహార్‌లో ఆర్సీపీ సింగ్‌ను ముందుపెట్టి రాజకీయం చేయాలని కమలం పార్టీ దాదాపు వ్యూహాలు సిద్ధం చేసిన వేళ.. నితీష్ అప్రమత్తం అయ్యారు. కమలం పార్టీకి అదిరిపోయే ఝలక్ ఇచ్చారు. బీజేపీకి ముందుగానే బైబై చెప్పేశారు. రాజకీయ పరిణామాలను పక్కాగా అంచనా వేయడంలో నితీష్‌ను మించిన వారు లేదు. బీజేపీలో మోదీ, షా ద్వయం ఎలా ఆలోచిస్తుందో.. ఎలాంటి అడుగులు వేస్తుందో.. పక్కాగా తెలిసినవాడు. మహారాష్ట్ర పరిణామాలు, దేశమంతా ఒకే పార్టీ అంటూ హైదరాబాద్ వేదికగా బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యల తర్వాత.. ఇక ఆలస్యం చేయాలనుకోలేదు నితీష్. వెంటనే బీజేపీకి బైబై చెప్పారు.

బీజేపీకి ఝలక్ ఇస్తూ నితీష్‌ తీసుకున్న నిర్ణయం.. విపక్షాల్లో కొత్త ఆశలు రేపుతోంది. కేంద్రంలో బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా ఏకం కావాలని విపక్షాలు చేయని ప్రయత్నాలు లేవ్‌. అన్నీ అనుకూలంగా సాగినట్లే కనిపించినా.. చివరికి ఏదో కారణంతో అవి పెద్దగా సక్సెస్ కాలేదు. ఇలాంటి సమయంలో విపక్షాలన్నీ నైరాశ్యంలో మునిగిపోయిన వేళ.. నితీష్ కుమార్ వ్యవహారం వారిలో కొత్త ఆశ రేపుతోంది. కేంద్రంలో మూడోసారి కూడా ఎన్డీఏదే అధికారం అని దాదాపు అంతా ఫిక్స్ అయిన వేళ.. అలాంటి అంచనాలు నితీష్ వ్యవహారంతో బ్రేక్ అయ్యాయని కొందరు అంటుంటే.. మరికొందరు లెక్కలు తీసి మరీ బీజేపీకి ప్రమాదం పొంచి ఉందని చెప్తున్నారు. ఇక 2014లో ఎలాగో గెలిచారు.. 2024 అంత సులువు కాదు అంటూ మోదీని ఉద్దేశించి నితీశ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేపుతున్నాయ్. ఆయన లక్ష్యం బిహార్‌కు మాత్రమే పరిమితం కాలేదు.. ఢిల్లీని టార్గెట్‌ చేశారు అన్నట్లు కనిపిస్తోంది.

ఢిల్లీని టార్గెట్ చేసినట్లు నితీష్ చేసిన వ్యాఖ్యలు.. ఇప్పుడు ప్రతిపక్షాల్లో కొత్త జోష్‌ నింపుతున్నాయ్. కేంద్రానికి వ్యతిరేకంగా కూటమి ఏర్పాటుకు రకరకాల ప్రయత్నాలు జరిగాయ్. బెంగాల్‌ రాజకీయాలను పక్కనపెట్టి మరీ దీదీ దేశమంతా తిరిగితే.. కేసీఆర్‌ ప్రత్యేకంగా పార్టీ పెట్టాలన్న నిర్ణయానికి కూడా వచ్చారు. ఐతే అన్నీ ప్రయత్నాల దగ్గరే ఆగిపోయాయ్. ఇలాంటి సమయంలో బిహార్ ఎపిసోడ్‌.. మళ్లీ కూటమి ప్రయత్నాలకు ఊపిరి అందిస్తోంది. దీనికితోడు బీజేపీకి బైబై చెప్పేముందు కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో నితీష్ మాట్లాడారు. దీంతో విపక్షాల తరఫున 2024లో ఆయనే ప్రధాని అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న చర్చ నడుస్తోంది. ఐతే ఇందులో నిజం ఎంత ఉన్నా.. 2024పై మళ్లీ విపక్షాలకు ఆశ పుట్టించడంలో నితీష్ సక్సెస్‌ అయ్యారు. బీజేపీ నుంచి జేడీయూ దూరం కావడంతో ఏం జరుగుతుందన్నది ఇప్పటికిప్పుడు ఒక అంచనాకు రాలేకపోవచ్చు. ఐతే విపక్షాల్లో మళ్లీ ఒక కదలిక అయితే మొదలైంది. దారులన్ని మూసుకుపోయాయనుకుంటున్న సమయంలో ఓ వెలుగు కనిపించినట్టైంది.

దీదీ సైలెంట్ అయ్యారు. కేసీఆర్ రంగంలోకి దిగుతారో లేదో తెలియదు. అఖిలేష్ యాదవ్ రెండోసారి ఓడిపోవడంతో ఆయన పేరు కూడా ప్రస్తావనకు రావడం లేదు. శరద్ పవార్ వయసైపోయింది. ఇలా విపక్ష కూటమిలో ప్రాంతీయ పార్టీల్లో మోదీకి ధీటైన నేత లేరు. కాంగ్రెస్ పార్టీకి రాహుల్ గాంధీ ఉన్నా.. సరిపోవడం లేదు. ఇవన్నీ ఆలోచించుకునే నితీష్ కుమార్ బీజేపీని డంప్ చేసి.. కాంగ్రెస్‌ కూటమి వైపు నడిచారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయ్. బీజేపీ వరుస విజయాలు.. ఆ పార్టీకి తిరుగులేదు అని చెప్తున్నాయ్. దీంతో కాంగ్రెస్‌తో సహా ప్రతిపక్షాలు వీక్ అవుతున్నాయ్. 2024పై ఆశలు పెట్టుకోవద్దు అనుకుంటున్న సమయంలో.. నితీష్ ఎపిసోడ్‌ వారి ఆశయానికి మళ్లీ జీవం పోసినట్లు అయింది.