Telangana Armed Movement : తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు.. దాని గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు : CPI నారాయణ

తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు..దానికి గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదు అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను హైజాక్ చేస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏపార్టీ పడితే ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో ఇప్పుడు మాట్లాడే ఏపార్టీలు లేవని అన్నారు.

Telangana  Armed Movement : తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు.. దాని గురించి మాట్లాడే హక్కు ఎవ్వరికి లేదు : CPI నారాయణ

Telangana Movement 1948

Telangana Armed Movement 1948 : తెలంగాణ సాయుధ పోరాటం కమ్యూనిస్టుల వారసత్వ హక్కు..దానికి గురించి మాట్లాడే హక్కు ఏ పార్టీకి లేదు అంటూ సీపీఐ నేత నారాయణ అన్నారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట యోధులను హైజాక్ చేస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏపార్టీ పడితే ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారని తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో ఇప్పుడు మాట్లాడే ఏపార్టీలు లేవని అన్నారు. తెలంగాణ సాయుధ పోరాటం మా వారసత్వ హక్కు అని మేం సగర్వంగా చెప్పగలం అని అన్నారు నారాయణ. సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు మీకు ఉందా? అంటూ సూటిగా ఆయా పార్టీలను ప్రశ్నించారు నారాయణ.

భారత స్వాతంత్ర్య ఉద్యమంలో బీజేపీ ఎక్కడుంది? బీజేపీ ఆ విషయాన్ని మరచి బీజేపీ ఉద్యమంలో పాల్గొన్నట్లే మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు. స్వాతంత్ర్య పోరాటంలోనే కాదు అసలు ఏ ఉద్యమంలోనే బీజేపీ పాత్ర ఉందని అమిత్ షా మాట్లాడేస్తున్నారు అంటూ ప్రశ్నించారు. అసలు సాయుధ పోరాట వారోత్సవాలు చేసే హక్కు మీకు ఉందా? ఉంటూ ప్రశ్నించారు. దేశంలో లౌకిక వ్యవస్థను నాశనం చేసేందుకు రాజకీయ లబ్దిల కోసం పోరాటాలను అడ్డంపెట్టుకుని మాట్లాడుతున్నారంటూ విమర్శలు సంధించారు. మతోన్మాద శక్తులను ప్రోత్సహిస్తు బీజేపీ పబ్బం గడుపుకుంటోంది అంటూ మండిపడ్డారు నారాయణ. బీజేపీ వ్యతిరేక కూటమిలోని రాని పార్టీలు దేశ ద్రోహులుగా మిగిలిపోతాయని సీపీఐ నేత నారాయణ అన్నారు.

కాగా..తెలంగాణలో సెప్టెంబర్ 17 చరిత్ర గురించి ఆయా పార్టీల నేతలు వారి సొంతం అన్నట్లుగా మాట్లాడాయి. తెలంగాణ విమోచనదినం అంటూ ఎప్పుడు లేనిది బీజేపీ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో సభ పెట్టి తెలంగాణ అమరవీరులను ఆకాశానికి ఎత్తేసింది. పోరాట యోధులు అంటూ తెలంగాణ ప్రజలను ప్రశంసలతో ముంచెత్తేశారు అమిత్ షా.

మరోపక్క టీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని హైదరాబాద్ నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్ లో నిర్వహించింది. ఈ సందర్భంగా కేసీఆర్ బీజేపీపై మండిపడుతూ..జాతీయ సమైక్యతకు ప్రతీకగా నిలిచే సెప్టెంబర్ 17ను వక్రీకరిస్తున్నారని..చిల్లర రాజకీయాలతో తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని అప్రమత్తంగా లేకపోతే సమాజాన్ని అల్లకల్లోలం చేసేస్తారు అంటూ విరుచుకుపడ్డారు.

ఇంకోపక్క కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి అటు బీజేపీపైనా..ఇటు టీఆర్ఎస్ పైనా విమర్శలు సంధించారు.దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెసే నని స్పష్టంచేశారు. స్వాతంత్ర్య సంగ్రామంలో బీజేపీ పాత్ర అసలు ఉందా? సాతంత్ర్య ఉద్యమంలో కాంగ్రెస్ పోరాడిందని అప్పుడు బీజేపీ పుట్టనేలేదన్నారు. అలాగే పనిలో పనిగా కేసీఆర్ పై కూడా విమర్శలు సంధించారు. తెలంగాణ ఏర్పడి ఇన్నాళ్లకు కేసీఆర్ కు జాతీయ సమైక్యత దినం గుర్తుకొచ్చిందా? ఇప్పటి వరకు ఎందుకు నిర్వహించలేదు?అంటూ ప్రశ్నించారు. ఇలా సెప్టెంబర్ 17 చరిత్ర గురించి ఎవరికి వారే తమ ఇష్టానురీతిగా వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమాల్లో మమేకం అయినట్లే వ్యాఖ్యలు చేశారు. ఒకపార్టీపై మరో పార్టీ విమర్శలు చేసుకున్నారు. ఈక్రమంలో అసలు మీకు సాయుధ తెలంగాణ పోరాటం గురించి మాట్లాడే హక్కులేదని దాని గురించి మాట్లాడే హక్కు కమ్యూనిస్టులకు మాత్రమే ఉందంటూ తేల్చిపారేశారు సీపీఐ నేత నారాయణ.