UP : యూపీలో మమతకు షాక్.. నల్లజెండాలతో నిరసన

అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని ఓ ప్రాంతంలో ఆమెకు అడ్డుగా కొంతమంది వ్యక్తులు నిల్చొని నల్లజెండా

UP : యూపీలో మమతకు షాక్.. నల్లజెండాలతో నిరసన

Mamata

Mamata Banerjee In UP : యూపీలో ఎన్నికలు పీక్ స్టేజ్ కు చేరుకున్నాయి. ఏడు దశల్లో ఇక్కడ పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐదు దశల్లో పోలింగ్ జరగగా, ఆరో దశ పోలింగ్ 2022, మార్చి 03వ తేదీన కొనసాగుతోంది. ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కు మద్దతుగా ప్రచారం చేయడానికి వచ్చిన వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి చేదు అనుభవం ఎదురైంది. యూపీలోని ఓ ప్రాంతంలో ఆమెకు అడ్డుగా కొంతమంది వ్యక్తులు నిల్చొని నల్లజెండాలను ప్రదర్శించారు. నినాదాలు చేస్తుండడంతో మమత బెనర్జీ సైలెంట్ గా అక్కడనే కొద్దిసేపు నిల్చొన్నారు. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Read More : PM Modi: కాంగ్రెస్ చేతకానితనమే మోదీ బలం.. – మమతా బెనర్జీ

గంగా హారతిలో పాల్గొనేందుకు వారణాసికి వచ్చారు. దశాశ్వమేధ ఘాట్ పై మెట్లపై కూర్చొని గంగా హారతీని వీక్షించారు. కుర్చీలు వేసినా ఆమె అందులో కూర్చొకపోవడం గమనార్హం. ఈ ఘటనపై యూపీ ఉప ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు కేశ్ ప్రసాద్ మౌర్య స్పందించారు. ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. కాశీలో హర్ హర్ మహాదేవ్, మధుర బృందావనంలో రాధే రాధే, జై కృష్ణ నినాదాలు చేస్తారని తెలిపారు. యూపీని వెస్ట్ బెంగాల్ గా మార్చాలని సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ పథకం పన్నుతున్నారని, అది ఎప్పటికీ నెరవేరదని విమర్శించారు. యూపీలో కమలం వికసిస్తుందని జోస్యం చెప్పారు.

Read More : West Bengal : మోదీకి మమత మద్దతు.. ఏ విషయంలో తెలుసా ?

ఇక మమతా బెనర్జ విషయానికి వస్తే… ఎస్పీకి మద్దతుగా ఆమె వారణాసిలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఏడో దశ పోలింగ్ మార్చి 07వ తేదీన జరుగనుంది. మార్చి 10వ తేదీన ఫలితాలు వెల్లడికానున్నాయి. మరి ఓటర్లు ఎవరికి పట్టం కట్టారనేది తెలసుకోవాలంటే అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.