West Bengal : మోదీకి మమత మద్దతు.. ఏ విషయంలో తెలుసా ?

యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను కూడా యూపీ ప్రచారానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నానని చెప్పారు.

West Bengal : మోదీకి మమత మద్దతు.. ఏ విషయంలో తెలుసా ?

Mamata Benerjee

West Bengal CM Mamata : ప్రధాని నరేంద్ర మోదీకి పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బేషరతు మద్దతిచ్చారు. రాజకీయంగా మోదీని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దీదీ మద్దతివ్వడమేంటని ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. యుక్రెయిన్‌ అంశంలో మాత్రమే మోదీకి సపోర్ట్‌ చేస్తోంది మమత. విదేశీ వ్యవహారాల్లో మనమంతా ఒక్కటే అన్నారు. మానవత్వం కన్నా రాజకీయాలు ముఖ్యం కాదన్నది కేంద్రం గ్రహించాలన్నారు. ప్రపంచ శాంతి కోసం చర్చలకు నేతృత్వం వహించే దమ్ము భారత్‌కు ఉందన్నారు మమతా. అయితే అక్కడి డెవలప్‌మెంట్స్‌ అన్ని తెలిసి కూడా కేంద్రం ముందుగానే విద్యార్థులను తీసుకురావడంలో విఫలమైందని విమర్శించారు.

Read More : Mamata Banerjee : నేను వస్తున్నా.. అఖిలేష్‌‌కు మద్దతుగా మమత బెనర్జీ

యూపీ ఎన్నికల ప్రచారంలో మోదీ బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు. తాను కూడా యూపీ ప్రచారానికి వెళ్లనున్నట్లు వెల్లడించారు. కానీ, నా పనులు పూర్తి చేసుకుని వెళ్తున్నానని చెప్పారు. ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికలు చివరి దశకు చేరడంతో హేమా హేమీలతో ప్రచారం హోరెత్తుతోంది. మమతా బెనర్జీ ఈసారి ప్రధాని నరేంద్ర మోదీ ఇలాకా వారణాసిలో పర్యటించనున్నారు. అఖిలేష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించనున్నట్లు దీదీ వెల్లడించారు. రెండు రోజుల పర్యటనలో కాశీ విశ్వనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరపనున్నారు. బెంగాల్ ప్రజల ఆశీర్వాదం తీసుకున్నాకే యూపీకి వెళ్తున్నానని చెప్పారు.

Read More : Mamata Banerjee: స్టాలిన్ , కేసీఆర్‎‎లకు మమతా ఫోన్ కాల్

మరోవైపు… ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నియోజకవర్గం గోరఖ్‌పూర్‌తో సహా 10 జిల్లాల్లో 57 అసెంబ్లీ నియోజకవర్గాలకు 2022, మార్చి 03వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రారంభమై సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. రెండు కోట్ల 14 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఆరో దశలో 57 సీట్లలో 11 సీట్లు షెడ్యూల్డ్ కులాలకు రిజర్వ్ చేయబడ్డాయి. ఈ దశలో మొత్తం 2.14 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్రంలోని 403 అసెంబ్లీ స్థానాల్లో ప్రతిపాదిత ఏడు దశల అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు దశల్లో 292 స్థానాల్లో ఓటింగ్ నిర్వహించగా, చివరి రెండు దశల్లో వరుసగా మార్చి 3, మార్చి 7 తేదీల్లో 111 స్థానాలకు పోలింగ్ జరగాల్సి ఉంది.