Electric Scooter Battery Blast : బాబోయ్.. బాంబులా పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, బాలుడు మృతి.. ఛార్జింగ్ పెట్టిన సమయంలో బ్లాస్ట్

ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా బాంబుల్లా పేలిపోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి. వామ్మో ఎలక్ట్రిక్ బైక్ అని బెంబేలెత్తిపోతున్నారు. భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. తాజాగా..చార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ బాలుడు మరణించాడు.

Electric Scooter Battery Blast : బాబోయ్.. బాంబులా పేలిన మరో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ, బాలుడు మృతి.. ఛార్జింగ్ పెట్టిన సమయంలో బ్లాస్ట్

Electric Scooter Battery Blast : హమ్మయ్య.. ఎలక్ట్రిక్ బైక్ లు వచ్చేశాయి.. ఇక పెట్రోల్ తో పని లేదు, ఎంచక్కా డబ్బు ఆదా చేయొచ్చు అని అంతా అనుకున్నారు. తెగ సంతోషపడ్డారు. కానీ, వారి ఆనందం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఇటీవలి కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ వరుసగా బాంబుల్లా పేలిపోతున్నాయి, మంటల్లో కాలిపోతున్నాయి.

దీంతో ఒక్కసారిగా ఈ-బైక్ వాడే వారితో పాటు వాటిని కొనాలనే వారిలోనూ భయాందోళనలు నెలకొన్నాయి. వామ్మో ఎలక్ట్రిక్ బైక్ అని బెంబేలెత్తిపోతున్నారు. భద్రత పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్.. చాలా డేంజర్ అని చెప్పే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. చార్జింగ్ అవుతున్న ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఓ బాలుడు మరణించాడు.

మహారాష్ట్రలోని వసాయ్ ఈస్ట్ లోని రామ్ దాస్ నగర్ ప్రాంతంలో విషాదం చోటు చేసుకుంది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ పేలి ఏడేళ్ల బాలుడు చనిపోయాడు. సెప్టెంబర్ 23న షానవాజ్ అన్సారీ అనే వ్యక్తి తన ఇంట్లో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టాడు. తెల్లవారుజామున అది ఒక్కసారిగా పేలిపోయింది. మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో షానవాజ్ కొడుకు షబ్బీర్ అన్సారీ తీవ్రంగా గాయపడ్డారు. బాలుడు షబ్బీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.

షానవాజ్ అన్సారీ తన భార్య, కొడుకు, తల్లితో కలిసి రామ్ దాస్ నగర్ లో నివాసం ఉంటున్నాడు. సెప్టెంబర్ 23న తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో షానవాజ్ తన బైక్ బ్యాటరీ తీసుకుని హాల్ లో ఛార్జింగ్ పెట్టాడు. ఆ తర్వాత బెడ్ రూమ్ కి వెళ్లి నిద్రపోయాడు. తెల్లవారుజామున 5 గంటల సమయంలో ఒక్కసారిగా భారీ శబ్దంతో బ్యాటరీ పేలిపోయింది. హాల్ లో మంటలు చెలరేగాయి. భారీ శబ్దం రావడంతో షానవాజ్ అన్సారీ ఉలిక్కిపడి లేచాడు. బయటకు వచ్చి చూసే సరికి షాక్ తిన్నాడు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

తన ఏడేళ్ల కొడుకు షబ్బీర్ మంటల్లో చిక్కుకుని ఉన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి తీవ్ర కాలిన గాయాలయ్యాయి. వెంటనే బాలుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కానీ, ప్రయోజనం లేదు. చికిత్స పొందుతూ బాలుడు చనిపోయాడు. రంగంలోకి దిగిన పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. బ్యాటరీ పేలిపోవడానికి కారణాలు తెలుసుకునే పనిలో పడ్డారు. బాలుడి మృతితో ఆ ఇంట్లో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కాగా, ఎలక్ట్రిక్ స్కూటర్ బ్యాటరీ పేలి బాలుడు చనిపోయిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. మరోసారి ఎలక్ట్రిక్ బైక్ ల సేఫ్టీ పై అనుమానాలు తలెత్తాయి.

ఆ రోజు అసలేం జరిగిందంటే..
ఆ రోజున జరిగిన ప్రమాదం గురించి షానవాజ్ అన్సారీ పోలీసులకు వివరించాడు. ”సెప్టెంబర్ 23.. తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ ప్రమాదం జరిగింది. ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ తీసుకుని ఇంట్లోని హాల్ లో ఛార్జింగ్ పెట్టాను. బ్యాటరీ ఛార్జింగ్ అవడానికి 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. దీంతో నేను ఛార్జింగ్ కు పెట్టి నిద్రపోవడానికి వెళ్లాను. సడెన్ గా ఉదయం 5 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించింది. నేను ఉలిక్కిపడి లేచాను. పరిగెత్తుకుని హాల్ లోకి వచ్చి చూశాను. అక్కడ పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. పైనున్న సీలింగ్ ఫ్యాన్ నేల మీద పడిపోయి ఉంది. నేను వెంటనే నా కొడుకు, నా తల్లిని తీసుకుని ఇంటి నుంచి బయటకు వచ్చేశాను. కానీ, అప్పటికే నా కొడుక్కి తీవ్రంగా కాలిన గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఎలక్ట్రిక్ బైక్ లేదా స్కూటర్ వాడే వారందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఎవరూ కూడా బ్యాటరీని ఇంట్లోకి తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టొద్దు” అని షానవాజ్ అన్సారీ వేడుకున్నాడు.