భారత్ లో రోటీలు కాల్చిన బ్రిటన్ రాజు ఛార్లెస్

  • Published By: veegamteam ,Published On : November 14, 2019 / 06:38 AM IST
భారత్ లో రోటీలు కాల్చిన బ్రిటన్ రాజు ఛార్లెస్

బ్రిటన్ రాజు ప్రిన్స్ ఛార్లెస్ భారతదేశంలో పర్యటిస్తున్నారు. ఈ సందర్బంగా గురువారం (నవంబర్ 14)న ఛార్లెస్ గురుద్వార్ బంగ్లా సాహిబ్ ను సందర్శించారు. ఢిల్లీ సిక్కు మేనేజమ్ మెంట్ కమిటీ ప్రిన్స్ చార్లెస్ కు ఘనంగా స్వాగతం పలికారు. తరువాత ఛార్లెస్ సిక్కులతో సరదా సరదాగా మాట్లాడుతూ..వారితో  ఫోటోలు దిగారు. అనంతరం గురుద్వారా లోని ప్రసాదం తయరు చేసే వంటశాలకు వెళ్లి..రోటీలు కాల్చారు.

భారత్ లో ప్రిన్స్ ఛార్లెస్ రెండు రోజుల పర్యట కోసం వచ్చారు. ఛార్లెస్ కు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్రపతి భవన్ లోని గార్డెన్ ను ఛార్లెస్ పరిశీలించారు. ఔషదీ వనంలో ఓ మొక్కను కూడా నాటారు. 
బుధవారం ఛార్లెస్ భారత వాతావరణ శాఖను సందర్శించారు. ముందస్తు వాతావరణ హెచ్చరికల వ్యవస్థ గురించి..ముఖ్యంగా తుఫానుల్ని ముందుగా ఎలా అంచనా వేస్తారు? అనే విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు.  ఛార్లెస్ కు ఐఎండీ డైరెక్టర్ జన్ రల్ మృత్యంజయ్ మెహపాత్ర అన్ని విషయాలను వివరించారు.