Justin Trudeau : జీ20 సమ్మిట్‌లో బసకి ప్రత్యేక గదిని నిరాకరించిన కెనడా ప్రధాని.. కారణం అదేనట..!

జీ20 సమ్మిట్‌ జరుగుతున్న సమయంలో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తనకు కేటాయించిన ప్రెసిడెన్షియల్ సూట్ కాదని.. హోటల్ రూమ్‌లోని సాధారణ గదిలో బస చేసారట. అందుకు కారణం ఏంటి?

Justin Trudeau : జీ20 సమ్మిట్‌లో బసకి ప్రత్యేక గదిని నిరాకరించిన కెనడా ప్రధాని.. కారణం అదేనట..!

Justin Trudeau

Updated On : September 21, 2023 / 3:03 PM IST

Justin Trudeau : జీ20 సమ్మిట్‌లో పాల్గొన్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తనకు ప్రత్యేకంగా కేటాయించిన హోటల్‌లో బస చేసారు. అయితే ప్రెసిడెన్షియల్ సూట్ తిరస్కరించి.. ఓ సాధారణ గదిలో బస చేసినట్లు తెలుస్తోంది. కారణం ఏంటి?

Canada : కెనడాలోమరో సంచలన హత్య .. ఖలిస్థాన్ ఉగ్రవాది సఖ్‌దూల్‌ సింగ్‌ హతం

G20 కోసం భారతదేశానికి వచ్చిన ప్రతి గ్లోబల్ లీడర్‌కు VVIP  హోటళ్లలో పూర్తి భద్రతతో కూడిన ప్రెసిడెన్షియల్ సూట్‌లను అందించారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో దేశ రాజధానిలోని లలిత్ హోటల్‌లో బస చేసారు. అయితే ప్రెసిడెన్షియల్ సూట్‌ను కాదని అదే హోటల్‌లోని సాధారణ గదిలో ఆయన బస చేసినట్లు భద్రతా వర్గాలు తెలిపాయి. జస్టిన్ ట్రూడో ప్రతినిధి ఒకరు ఖర్చు పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు భద్రతా ఏజెన్సీలకు తెలిపారు. కానీ సరైన సమాచారం మాత్రం అందలేదు.

Khalistani Terrorist Threat : ఇండియాకు వెళ్లిపోవాలంటూ కెనడాలోని భారతీయ హిందువులకు ఖలిస్థాన్ ఉగ్రవాది బెదిరింపు

ట్రూడో సెప్టెంబర్ 10 న భారత్ నుంచి బయలుదేరాల్సి ఉంది. అయితే తమ ఎయిర్ బస్ విమానంలో సాంకేతిక లోపం కారణంగా ఆయన బసను పొడిగించారు. వెంటనే భారత్ విమాన సేవలను అందించేందుకు ముందుకు వచ్చినా జస్టిన్ ట్రూడో ప్రతినిధులు తిరస్కరించారట. బ్యాకప్ ఎయిర్ క్రాఫ్ట్ కోసం వేచి చూసినా ట్రూడో సెప్టెంబర్ 12 న మాత్రమే భారత్ నుంచి బయలుదేరారు. ఇదిలా ఉంటే ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ నిజ్జార్‌ను చంపడంలో భారత్ ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపించిన తర్వాత భారత్, కెనడా మధ్య ఉద్రిక్తతలు పెరిగాయి. దీని తర్వాత కెనడా ఒక భారతీయ దౌత్యవేత్తను దేశం నుండి బహిష్కరించింది.