High Court : ఇష్టంతో శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్, పాన్ కార్డులు చూడాల్సిన పని లేదు? ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్, పాన్ కార్డులు చూస్తారా? అలా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యానించింది. ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన పార్టనర్ పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.

High Court : ఇష్టంతో శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్, పాన్ కార్డులు చూడాల్సిన పని లేదు? ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

'Can't Check Aadhaar Card Before Sex'

Delhi High Court : కొన్ని కొన్ని కేసులు విచారణ సమయాల్లో కోర్టులు పలు కీలక వ్యాఖ్యలు చేస్తుంటాయి. ముఖ్యంగా అత్యాచారం..లైంగిక వేధింపులు..గృహహింస వంటి కేసుల విషయాలో ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటాయి. ఓ మైనర్ అత్యాచారం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఇటువంటి వ్యాఖ్యలే చేసింది. ఇరువురూ ఏకాభిప్రాయంతో శారీరక సంబంధం పెట్టుకోవాలని అనుకుంటే..ఆ సంబంధం పెట్టుకోవటానికి ముందు వారి వారి వివరాలు తెలుసుకోవాటానికి వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డులు చూస్తారా? అంటూ మైనర్‌పై అత్యాచారం కేసు విచారణ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి తన పార్టనర్ పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు ఈ కేసు విచారణ సందర్భంగా స్పష్టం చేసింది.

అధికారిక పత్రాల ప్రకారం మూడు వేర్వేరు పుట్టిన రోజు తేదీలు కలిగి ఉన్న తన మైనర్ భాగస్వామిపై అత్యాచారం చేశాడని ఆరోపించిన వ్యక్తికి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఈ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒక వ్యక్తి ఆమెతో ఏకాభిప్రాయంతో (ఇష్టపడి) శారీరక సంబంధం పెట్టుకునే ముందు ఆధార్ కార్డ్ లేదా పాన్ కార్డ్ చూడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో తనపై పిల్లల దుర్వినియోగ చట్టంలోని నిబంధనలను అమలు చేయడానికి మాత్రమే బాధితురాలు తన పుట్టిన తేదీలను ఉపయోగించుకుంటోందని నిందితుడి తరఫు న్యాయవాది వాదనతో కోర్టు ఏకీభవించింది.

‘మరొక వ్యక్తితో ఏకాభిప్రాయంతో శారీరక సంబంధంలో ఉన్న వ్యక్తి, అవతలి వ్యక్తి యొక్క పుట్టిన తేదీని న్యాయపరంగా పరిశీలించాల్సిన అవసరం లేదని..అతను ఆధార్ కార్డునో పాన్ కార్డునో లేదంటే ఆమె స్కూల్ రికార్డులో పుట్టిన తేదీ చూశాకే శారీరక సంబంధం పెట్టుకోవాలని లేదని తెలిపింది. ఈ కేసులో బాధితురాలి పుట్టిన తేదీకి సంబంధించి..ప్రాసిక్యూటర్లు మూడు వేర్వేరు తేదీలను చూపించారు. ఆధార్ కార్డ్ ప్రకారం ఆమె పుట్టిన తేదీ 01.01.1998గా ఉంది. కాబట్టి పిటీషనర్ మైనర్‌తో శారీరక సంబంధం పెట్టుకోలేదని చెప్పడానికి ఇది సరిపోతుంది’ అని జస్టిస్ జస్మిత్ సింగ్ అన్నారు.

బాధితురాలిగా పేర్కొన్న వ్యక్తి ఖాతాలోకి భారీ మొత్తంలో డబ్బు బదిలీ చేయడాన్ని గమనించిన ధర్మాసనం ఇది హనీ ట్రాప్ అని ప్రాథమిక నిర్థారణకు వచ్చింది. ఈ క్రమంలో 2019, 2021లో తనపై అత్యాచారం జరిగిందని బాధితురాలు ఆరోపించిన ఈ కేసులో ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారని..కేసు నమోదుకు ఇంత ఆలస్యం ఎందుకు అయిందో అనే విషయంపై సంతృప్తికర కారణం కోర్టుకు చూపలేదని సూచించింది.

బాధితురాలు ఇతర వ్యక్తులపై కూడా ఇటువంటి కేసులు పెట్టిందని..డబ్బులు గుజింది అని ఆరోపించారు ప్రతివాదులు. ఆమె పుట్టిన తేదీ వివరాలు తెలుసుకోవటానికి ఆమె ఆధార్ కార్డు వివరాలపై విచారణ చేపట్టాలని పోలీస్ కమిషనర్ ను హైకోర్టు ఆదేశించింది. రూ. 20 వేల వ్యక్తిగత పూచీకత్తుపై నిందితుడిని విడుదల చేయాలని..కేసు విచారణ కోసం పిలిచినప్పుడల్లా పోలీసు స్టేషన్‌లో రిపోర్టు చేసి కోర్టుకు హాజరు కావాలని కోర్టు ఈ సందర్భంగా ఆదేశించింది.