Bihar Train Incident : చాలా చాలా లక్కీ.. చావు జస్ట్ మిస్.. పైనుంచి వెళ్లిన రైలు, అయినా బతికిపోయాడు

రైలు పట్టాలు దాటేందుకు షార్ట్ కట్ వాడి ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. చావు అంచుల వరకు వెళ్లాడు. అయితే, ఆ వ్యక్తికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నట్లున్నాయ్.. చావు.. జస్ట్ మిస్ అంతే.. రెప్పపాటులో మరణాన్ని తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి మీద నుంచి రైలు వెళ్లినా అతడు బతికిపోయాడు.

Bihar Train Incident : చాలా చాలా లక్కీ.. చావు జస్ట్ మిస్.. పైనుంచి వెళ్లిన రైలు, అయినా బతికిపోయాడు

Bihar Train Incident : ఓ రైల్వే స్టేషన్ లో చోటు చేసుకున్న ఘటన అందరినీ షాక్ కు గురి చేస్తోంది. రైలు పట్టాలు దాటేందుకు షార్ట్ కట్ వాడి ప్రమాదం కొని తెచ్చుకున్నాడో వ్యక్తి. చావు అంచుల వరకు వెళ్లాడు. అయితే, ఆ వ్యక్తికి ఇంకా భూమ్మీద నూకలు మిగిలే ఉన్నట్లున్నాయ్.. చావు.. జస్ట్ మిస్ అంతే.. రెప్పపాటులో మరణాన్ని తప్పించుకున్నాడు. ఆ వ్యక్తి మీద నుంచి రైలు వెళ్లినా అతడు బతికిపోయాడు.

వివరాల్లోకి వెళితే.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో ఒకటి సోషల్​ మీడియాలో హల్​చల్​ చేస్తోంది. ఓ వ్యక్తి రైల్వే స్టేషన్ లో ఒక ప్లాట్ ఫామ్ నుంచి మరో ప్లాట్ ఫామ్ మారేందుకు.. నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. రైలు పట్టాలపై దాటే ప్రయత్నం చేశాడు. ట్రాక్ పై ఆగి ఉన్న గూడ్స్​ రైలు కింద నుంచి పట్టాలు​ దాటేందుకు యత్నించాడు.

అయితే, అనుకోకుండా ఒక్కసారిగా రైలు కదిలింది. దీంతో ఆ వ్యక్తి రైలు కింద చిక్కుకుపోయాడు. అంతా ఆ వ్యక్తి చనిపోయాడనే అనుకున్నారు. కానీ, రైలు వెళ్లిన తర్వాత ఆ వ్యక్తి హ్యాపీగా నడుచుకుంటూ బయటికి రావడంతో అంతా విస్తుపోయారు. ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

ఒక్కసారిగా రైలు కదలినా.. ఆ వ్యక్తి ఏ మాత్రం కంగారు పడలేదు, అస్సలు భయపడలేదు. కాస్త సమయస్ఫూర్తిగా వ్యవహరించాడు. రైలు కింద పట్టాల మధ్య అలానే పడుకుని ఉండిపోయాడు. దీంతో రైలు అతడి మీది నుంచి వెళ్లినా అతడికి చిన్న గాయం కూడా కాలేదు. అదృష్టవశాత్తు అతడు చావు నుంచి బయటపడ్డాడు. రైలు వెళ్లిపోయాక అతగాడు.. తన బ్యాగ్ తీసుకుని అసలేమీ జరగనట్లు అక్కడి నుంచి నవ్వుతూ వెళ్లిపోవడం గమనార్హం. బీహార్ లోని భగల్ పుర్ పరిధిలోని కహల్ గావ్ స్టేషన్ లో ఈ ఘటన జరిగింది.

గూడ్స్ రైలు అతని మీదుగా వెళ్లడం చూసిన చుట్టుపక్కల వాళ్లు అతడి ప్రాణాల గురించి ఆందోళనకు గురయ్యారు. లేవద్దు, కదలొద్దు అంటూ కేకలు వేస్తూ హెచ్చరించారు. తీరా రైలు అతడి మీద నుంచి వెళ్లినా, అతడు క్షేమంగా బయటపడటంతో అంతా రిలాక్స్ అయ్యారు.

ఆ వ్యక్తి ఒక ప్లాట్‌ఫామ్ నుండి మరొక ప్లాట్‌ఫామ్‌కు మారే ప్రయత్నంలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ మీద నుంచి వెళ్లకుండా “షార్ట్ కట్” వాడాడు. రైలు కింద నుంచి ట్రాక్ దాటాలని అనుకున్నాడు. అదే అతడిని చావు అంచుల వరకు తీసుకెళ్లింది. అయితే, రైలు కదలడంతో అతడు పట్టాలపై పడుకుండిపోయాడు.

కాగా, రైల్వే స్టేషన్ లో రైలు పట్టాలు దాటేందుకు ఓవర్ బ్రిడ్జిలు ఉంటాయి. అయినా కొందరు నిర్లక్ష్యంగా ట్రాక్ దాటే ప్రయత్నం చేస్తూ ఇదిగో ఇలాగే ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.